ముందస్తుకు బీజేపీ బ్రేకులు?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొకాలడ్డుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు సిద్ధమవుతున్న సమయంలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని బీజేపీ ప్రభుత్వం తెరపైకి తేవడంతో ఈ అనుమానాలు బల పడుతున్నాయి. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ రాజకీయ పక్షాల్లో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌లో ఎన్నికలు జరిపించాలని భావించింది. అందుకు అనుగుణంగానే శాసనసభను రద్దు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘం శాసససభ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తమవుతుంది. ఇదిలావుండగా ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా ముందస్తుకు తొందరేముందని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఆయన ప్రకటనను ఇప్పుడు అన్ని పక్షాలు ఓసారి గుర్తుచేసుకుంటున్నాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాలనే ఆకాంక్షతో బీజేపీ ప్రభుత్వం ఉన్నందుననే నియోజక వర్గాల పునర్విభన అంశం తెరపైకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే నిజమైతే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అవకాశం ఉందబోదని వారంటున్నారు. నవంబర్‌లో జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో నియోజక వర్గాల పునర్విభజన చట్టానికి ఆమోదం పొందడంతో జనవరి తర్వాతనే ఎన్నికలకు అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ  నియోజకవర్గాల పెంపుపై  కేంద్ర హోంమంత్రిత్వశాఖ కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు చేపట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. గత మూడునెలలుగా ఈ అం శంపై స్పష్టత తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని భోగట్టా. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.