భూమా వార్తలు కట్ 

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. జిల్లా మంత్రి భూమా అఖిల ప్రియ వార్తలు ప్రసారం చేయవద్దని ఏపీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఆదేశం. అంతే వారు సిటీ కేబుల్ లో వారిద్దరి వార్తలను ప్రసారం చేయడం లేదు. అంతే మంత్రి అఖిల ప్రియకు కోపం వచ్చింది. తమకు 50 శాతం వాటా ఉంది. మా వార్తలను ఇవ్వాలని ఆదేశించారు. అయినా సిబ్బంది ఒప్పుకోలేదు. ఏమైనా ఉంటే భూమా అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోవాలని చెప్పారు. అంతేనా… ఏవీతోనా.. నెవర్ అంటున్నారు. అంతే భూమా కుటుంబం వార్తలు లేకుండానే కేబుల్ టీవీ ప్రసారాలు సాగుతున్నాయి. దశాబ్దాలుగా కేబుల్ టీవీలో ప్రధాన వార్తలు భూమా కుటుంబానివే ఉంటాయి. అలాంటిది అసలు వారి వార్తలు లేకుండానే వార్తలు రావడంతో మంత్రి అఖిల ప్రియ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. 
భూమా అఖిల ప్రియ తనకు రావాల్సిన భూమి వాటా ఇవ్వకుండా ఎగ్గొట్టారని.. అందుకే కేబుల్ టీవీలో వారి వార్తలు ఆపు చేస్తున్నారని తెలుస్తోంది. రానున్న కాలంలో అవసరమై భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. భూమా ఉన్నప్పుడు వారి ఆలనా పాలనా అంతా ఏవీనే చూసుకునే వారు. భూమా దంపతులు ఇప్పుడు లేరు. కానీ వారికి ఆసరగా ఉంటున్న ఏవీని పక్కన పెట్టారు కుటుంబ సభ్యులు. అందుకే ఆయన తన ప్రతాపం చూపుతున్నారు. మంత్రి పదవి వచ్చాక అసలు అఖిల ప్రియ వారిని ఎవరినీ లెక్కే చేయడం లేదంటున్నారు. మరోవైపు మంత్రిని ఢీకొట్టేందుకు ఏవీ సిద్దమవుతున్న తీరు హాట్ టాపికైంది.
శిల్పా వర్గీయుల హ్యాపీ
నంద్యాల సిటీ కేబుల్‌లో భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి వార్తలు బంద్‌ కావడం వైకాపా నేతలకు సంతోషాన్నిస్తోంది. అది ఉండటం వల్లనే గతంలో తాము ఓడిపోయమని శిల్పా వర్గీయులు అంటున్నారు. మంత్రి భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి ‘ఆత్మ స్నేహితుడు’  ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్‌ మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇరు వర్గాలకు చెందిన సీనియర్ నేతలు. కానీ ఇద్దరు వినడంలేదు ఫలితంగా ఈ కేసు ఇక సిఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లోనూ వీరి వార్తలకు బ్రేక్‌ పడింది. భూమా కుటుంబ వార్తలు లేకుండా ఉండటం సిటీ కేబుల్‌ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం.  
ఏవీని ఆపలేరట
ఏవీని అడగకుండా భూమా ఏ రాజకీయ నిర్ణయమూ తీసుకునేవారు కాదు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏవీ సుబ్బారెడ్డి భారీ విందును ఆళ్లగడ్డలో ఇచ్చారు. అక్కడకు వెళ్లకుండా అఖిల వర్గీయులు కట్టడి చేశారు. అయినా చాలా మంది అక్కడకు వెళ్లారు. తాజాగా ఏవీ హెల్ప్‌లైన్‌ పేరుతో సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో కార్యకలాపాలు ప్రారంభించారు. మార్కెట్‌యార్డులో రైతులకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఇదే వారి మధ్య రగడ రేపింది.  నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వెళ్లింది. 
ఇప్పుడు కేబుల్‌ వార్‌కు ఏవీ సుబ్బారెడ్డి తెరలేపారు. మొదటగా మంత్రి అఖిలప్రియకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయలేదు. మంత్రి వార్తలు ఇవ్వకపోతే నావి వద్దని చెప్పారు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అంతే ఆయనవి ఆపేశారు. వారం రోజులుగా సాగుతున్న గొడవకు పుల్ స్టాప్ పడితేనే మంచిది. లేకపోతే ఇంటి గుట్టు మరింత రచ్చ చేసే అవకాశముంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.