బోగీ మంటలు అంటించేందుకు ఒప్పుకోని జగన్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంబరాన్నంటుతోంది. సిఎం చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లెలో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తల మధ్య పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చంద్రగిరిలోనే పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే భోగి పండుగ నాడు జగన్ వ్యవహరించిన తీరు హాట్ టాపికైంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం నెన్నూరులో ఉన్న జగన్ ను భోగి మంటలు అంటించాలని కోరారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కానీ ఆయనకు భోగి సంబరాల్లో మునిగిపోవడం ఇష్టం లేదనట్లుగా వ్యవహరించారు. సున్నితంగా తిరస్కరించి, పాదయాత్ర చేస్తు ముందుకు కదిలారు…

ఫలితంగా అక్కడకు వచ్చిన మహిళలే కాదు…కార్యకర్తలు బిత్తరపోయారు. బోగీ రోజు తెలవారక ముందే ఏర్పాట్లు చేసి జగన్ కోసం వేచి చూస్తే ఇంత పని చేశాడేంటి అనుకుంటున్నారు అంతా. బోగీ మంటల వేడుకల్లో పాల్గొనకుండా జగన్ ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు అని తిట్టుకుంటున్నారు. సాక్షి పేపర్ మాత్రం ప్రజలంతా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

2 Comments

  1. ఆంధ్ర ప్రదేశ్ కి పట్టిన దరిద్రం జైల్మోహన్ రెడ్డి గాడు..

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.