ప‌వ‌న్ యాత్ర‌తో కాంగ్రెస్‌లో బెదురు…..

రెండు రాష్ట్రాల విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ ప‌రిస్థ‌తి దీన స్థితికి చేరింది. తెలంగాణ‌లో కొన్ని సీట్లు ల‌భించ‌గా ఏపీలో నామ‌రూపాలు లేకుండా ఓట‌మి పాలైంది. 2020 క‌ల్లా క‌నీసం ఉనికినైనా చాటుకోవాల‌ని రెండురాష్ట్రాల నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ కాస్త దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం. ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్దంగా న‌డుచుకుంటుండ‌టంతో కాంగ్రెస్ నేత‌లు వెలుగులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ల‌భించ‌డం లేదు. ఇక  తెలంగాణ‌లో అధికారం కోసం నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు లేవు. కాని కేసీఆర్ మాత్రం వారి విమ‌ర్శ‌ల‌ను క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డంతో అనుకున్న‌ మైలేజీ రావ‌డం లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ప‌వ‌న్ మీద దృష్టిసారించింది. ప‌వ‌న్ వ‌ల్ల రెండు రాష్ట్రాల్లో న‌ష్ట‌పోయేది కాంగ్రెస్ అని ఢిల్లి నేత‌లు ఇప్ప‌టికే తేల్చి చెప్పార‌ట‌. ప‌వ‌న్ చేస్తున్న ప‌నులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విమ‌ర్శ‌లు చేస్తూ ఇర‌కాటంలో పెట్టాల‌ని అధిష్ఠానం గ‌ట్టిగా చెప్పిందట‌. దీంతో ఇక్క‌డ నేత‌లు త‌మ అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా కొండ‌గ‌ట్టు నుంచి యాత్ర మొద‌లు పెట్టిన ప‌వ‌న్‌కు మొద‌టి ఆటంకం మాజీ ఎంపి పొన్నం ప్ర‌భాక‌ర్ రూపంలో ఎదురుకానున్న‌ది. కొండగట్టులో మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే తమకు అభ్యంతరం లేదు కానీ రాజకీయ మనుగడ కోసం వస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. పవన్ పర్యటన వెనుక కేసీఆర్ ఉన్నారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కల్యాణ్ ను కేసీఆర్ రంగంలోకి దింపుతున్నారని పొన్నం ఆరోపించారు. ప‌వ‌న్ తెలంగాణ‌లో తిర‌గ‌కుండా అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ ప‌రిస్థితుల‌పై ప‌వ‌న్ కు అవ‌గాహ‌న లేదంటూ విమ‌ర్శించారు. మ‌రి ప‌వ‌న్ యాత్ర‌కు కాంగ్రెస్ ఆటంకం క‌లిగిస్తే రాజ‌కీయ ఉద్రిక్త నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని  విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో…!

1 Comment

  1. అది పవన్ యాత్ర కానే కాదు. కేసిఆర్ భజన యాత్ర. తెలంగాణ ప్రజలకు బిస్కెట్ వేసే యాత్ర. ఆంధ్రుల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టే యాత్ర.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.