బండ్ల గ‌ణేషా.. దేవుడ‌న్నావు.. ఏందిట్టా చేశావు!

అంత‌న్నాడు.. ఇంత‌న్నాడే. అన్న‌ట్లు.. పాపం.. బండ్ల గ‌ణేష్‌.. అదేనండీ.. కామెడీ క‌మ్‌.. నిర్మాత క‌మ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమాని.. క‌మ్ ఇలాంటివ‌న్నీ చెప్పిన ప‌వ‌ర్‌స్టార్ వీర‌భ‌క్త‌డు. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి చేరాడు. పాప‌ం.. దేవుడిని కాద‌ని.. మ‌నుషులు.. అందులోనూ ప‌వ‌న్ కు పూర్తిగా న‌చ్చ‌ని పార్టీలోకి జంప్‌చేసి.. ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చాడు. పైగా షాద్‌న‌గ‌ర్ నుంచి టికెట్‌కు కూడా దాదాపు క‌న్‌ఫామ్ చేసుకున్న‌ట్లు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. పార్టీలోకి చేర‌టం.. కూడా.. ఏదో ఉత్త‌మ్‌. జానా వంటి వారితో కాదు.. ఏకంగా హ‌స్తం రాజు.. సారీ.. కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలోనే..  ఇందులో విచిత్రం ఏమిలేక‌పోవచ్చు. కానీ.. గ‌ణేష్ చిన్న‌పాటి ఆర్టిస్ట్‌.. క్ర‌మంగా కోట్లాదిరూపాయ‌ల పెట్టుబ‌డి బ‌డాస్టార్స్‌తో సినిమాలు తీసేంత రేంజ్‌కుచేరాడు.. దాదాపు అన్నీ హిట్లే. బ్లాక్‌మ‌నీ దాచుకున్న కొంద‌రికి బండ్ల బినామీ అనే గుస‌గులు కూడా వినిపించేవి.
అటువంటి స‌మ‌యంలోనే గ‌బ్బ‌ర్‌సింగ్ తో సూప‌ర్‌డూప‌ర్ హిట్‌కొట్టి త‌న వీర‌భక్తిని చాటుకున్నాడు. ఆ త‌రువాత‌.. ప్ర‌తి సినిమా ఫంక్ష‌న్‌లోనూ.. అన్న‌య్య మెగాస్టార్‌ను.. త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్‌ను.. తెగ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి.. త‌న్మ‌యం చెందేవాడు. అబ్బా.. వీడేంట్రా బాబు.. ఇలా హింస‌పెడుతున్నాడంటూ మెగా ఫ్యామిలీ విల‌విల‌లాడేంత‌గా చేసిన బండ్ల‌… ఊహించ‌ని విధంగా మూడురంగుల కండువా క‌ప్పేసుకున్నాడు. అయితే.. కొద్దికాలం వ‌ర‌కూ బండ్ల సైకిల్ ఎక్కుతాడ‌ని భావిస్తూ వ‌చ్చారు. అయితే.. ఇప్పుడు హ‌స్తం, సైకిల్ మ‌హాకూట‌మితో ఒక్క‌టి కాబోవ‌టంతో.. ఎక్క‌డున్నా ఓక్క‌టే అన్న‌ట్లుగా భావించిన గ‌ణేషుడు.. ఎంచ‌క్కా హ‌స్తం చేయి ప‌ట్టుకుని.. చెట్ట‌ప‌ట్టాల్ వేస్తాడట అదృష్టం బావుంటే.. వచ్చే అంసెబ్లీలో అధ్య‌క్షా.. అంటూ కూడా ఎమ్మెల్యే స్థానంలో స్పీచు ఇవ్వ‌బోతాడ‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.