బాలయ్య.. కేసీఆర్‌పై ఫైర్ అయింది ఇందుకే

తెలుగుదేశం పార్టీకే కాకుండా ప్రజాకూటమికి స్టార్ క్యాంపైనర్‌గా పని చేశారు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. అభ్యర్థులను ప్రకటించడానికి ముందే బాలయ్య ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఎన్నికల ప్రచారానికి కూడా వాడుకోవాలని టీడీపీ అధిష్ఠానం భావించింది. అందులో భాగంగానే ప్రజాకూటమి తరపున ప్రచారం నిర్వహించాలని ఆయనను కోరింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య ప్రచార చేయాలని నిర్ణయించుకున్నారు. పేరుకు టీడీపీ ఎమ్మెల్యేనే అయినా ప్రజాకూటమిలోని అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారాయన. దీనికి విశేష స్పందన వచ్చింది. ఆయన నిర్వహించిన రోడ్‌ షోలు సక్సెస్ అయ్యాయి. దీంతో కూటమిలోని నేతల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. బాలయ్య పర్యటనలో ఓ ప్రశ్న అందరినీ తలచి వేసింది. అదే నందమూరి నటుడు తన పర్యటన తొలి రోజు కేసీఆర్‌ను గానీ, టీఆర్ఎస్ నాయకులను గానీ విమర్శించకపోవడం.. వారిని ప్రస్తావించకుండానే ఆరోజు రోడ్ షోలు ముగించడం. అసలు బాలయ్య ఎందుకిలా చేశాడని చాలా మంది ఆశ్చర్యపోడారు.

అయితే, తర్వాతి రోజు నుంచి నందమూరి బాలకృష్ణ తన పంథాను మార్చుకున్నారు. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి చేసిన రోడ్ షోలలో ‘కేసీఆర్‌ ఎంతో మందిని ఏదో చేస్తానన్నాడు. దళితుడిని సీఎం చేస్తానన్నాడు.. చేసిండా? గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నాడు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నాడు. బట్టేబాజ్‌ మాటలు చెప్పిండు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అంతేకాదు,
‘సెక్రటేరియట్‌కు రాలేకపోయానని, మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని రూ.2లక్షల కోట్ల అప్పులు చేసిన మోసగాడినని చెప్పుకుంటారా..? ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పుకుంటారు సీఎం కేసీఆర్‌?’ అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్‌ చంద్రబాబును బెదిరిస్తూ రేపు ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో వేలు పెడతానంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. ‘ఆంధ్రకు వస్తావా..? రా.. దమ్ముంటే చూసుకుందాం’ అంటూ సవాల్‌ విసిరారు. అయితే, ఉన్నట్లుండి బాలయ్యలో ఈ చేంజ్ రావడానికి కారణం ‘కేసీఆర్‌కు భయపడే బాలయ్య ఆయన పేరు ఎత్తడం లేదు’ అని వచ్చిన పుకార్లేనని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.