నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్యను స్పందించమంటే..

కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణను మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ ద్వారా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనడంతో పాటు కొన్ని సందర్భాల్లో పవన్, చిరుల మీద బాలయ్య చేసిన వివాదాస్పద కామెంట్లను దృష్టిలో ఉంచుకుని నాగబాబు సెటైర్లు వేశాడు. తన వ్యాఖ్యలపై నందమూరి అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో కొన్ని రోజులుగా ఆ వ్యాఖ్యలకు వీడియోల రూపంలో వివరణ కూడా ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాగబాబు వ్యాఖ్యలు, విమర్శలపై బాలయ్య నుంచి ఎలాంటి స్పందన ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాగబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు బాలయ్య ఎప్పుడు దొరుకుతాడా అని మీడియా వాళ్లు ఎదురు చూస్తుండగా.. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సక్సెస్ సంబరాల్లో భాగంగా మీడియాను కలిశాడు బాలయ్య. ఈ సందర్భంగా విలేకరులు నాగబాబు వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు అని ప్రశ్నించారు. దానికి సీరియస్‌గా ‘నో కామెంట్’ అని బదులిచ్చాడు బాలయ్య. ఇంకో విలేకరి మళ్లీ అదే ప్రశ్న వేశాడు. మళ్లీ బాలయ్య ‘నో కామెంట్’ అనే అన్నాడు. బహుశా బాలయ్య మున్ముందు కూడా ఈ విషయమై స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. బాలయ్య స్పందిస్తే.. వివాదం మరింత పెద్దదయ్యేందుకు ఆస్కారముంది. బహుశా ఈ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నుంచి బాలయ్యకు ఏమైనా మార్గదర్శకాలు అంది ఉండొచ్చని.. అందుకే ఆయనేమీ స్పందించట్లేదని అనిపిస్తోంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.