బాలయ్యకు ఆపరేషన్

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ కు సిద్దమవుతున్నాడు నందమూరి అందగాడు బాలయ్య. కానీ ఈలోపు ఆయన భుజానికి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యేగా, నటుడుగా రాణిస్తున్న బాలకృష్ణకు 8 నెల‌ల కిందట భుజానికి గాయం అయింది. కొద్దిపాటి గాయమే అయినా పైసా వ‌సూల్‌,  జైసింహా షూటింగ్‌ల‌తో బిజీ అయ్యాడు. బాల‌య్య ఆ బాధ భ‌రిస్తూనే షూటింగ్‌ల‌కు హాజ‌రయ్యాడు. పైసా వసూల్ లో కారును తిప్పే సమయంలోను ఆ నొప్పి తిరగబెట్టింది. ఫలితంగా చాలా ఇబ్బంది పడ్డారట. అయినా సరే షూటింగ్ లు పూర్తి అయ్యేంత వరకు మౌనం దాల్చారు. సంక్రాంతికి వచ్చిన జైసింహా హడావుడి ముగియడంతో ఆయన ఇప్పుడు తీరిగ్గా స‌ర్జ‌రీ చేయించుకున్నాడంటున్నారు.
తేజ ద‌ర్శ‌క‌త్వంలో త‌న తండ్రి దివంగ‌త ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయనున్నాడు బాలయ్య. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిఫ్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. దాని కంటే ముందే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఎన్టీఆర్ పాత్రను పోషించాలంటే మాటలు కాదు. అదే సమయంలో స్క్రిఫ్టు విషయంలో తప్పులకు తావులేకుండా చేస్తున్నారు. వివాదాంశాల జోలికి పోకుండా కథను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమర్శలకు తావు లేకుండా అన్నగారిని చూపిస్తారట. అంతే కాదు.. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను చూపించినా.. చంద్రబాబు విషయానికి వచ్చేసరికి వ్యతిరేకంగా చూపించే అవకాశం లేదంటున్నారు.
ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను కాదని… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి తీసుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేస్తారట. మొత్తంగా ఎన్టీఆర్ ఘన విజయాలతో పాటు.. తెలుగు జాతి ఖ్యాతిని వ్యాపింపజేసిన వైనం ఆ సినిమాలో ప్రస్తావించనున్నారు. ఎన్నికల నాటికి ఈ సినిమాను రెడీ చేేస్తే ఇక ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.   
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.