బాల‌య్య‌.. బాహుబ‌లి… తెలంగాణ ఎన్నిక‌లు

కొంత‌కాలం క్రితం తెలంగాణ రాష్ట్ర స‌మితి బ‌లంగా ఉంద‌ని… ఏవో కొన్ని స‌ర్వేలు చెబితే న‌మ్మిన కేసీఆర్ ఎన్నిక‌ల‌కు పోయారు. అయితే, ఆ స‌ర్వేల‌న్నీ హంబ‌క్ అని తేల‌డంతో ఎటూ తేల‌క జుట్టుప‌ట్టుకుంటున్నారు. ఏ అస్త్రమూ ప‌నిచేయ‌ద‌ని తెలిసి… చివ‌ర‌కు *మోస‌పోవ‌ద్దు… తెలంగాణ బిడ్డ‌నే ఎంచుకోండ‌ని* ప్ర‌జ‌ల‌ను బ‌తిమాలుకుంటున్నాడు కేసీఆర్‌. అయితే ఈ విష‌యంపై ఎక్క‌డ కేసీఆర్‌కు అనుమానం వ‌చ్చిందో తెలుసా?

కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల గురించి మాట్లాడుతుంటే ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన స్పంద‌న క‌నిపించింది. అదే కేసీఆర్ గొప్ప‌ల‌కు స్పంద‌న లేకుండా పోయింది. చివ‌ర‌కు అనామ‌కులు కేసీఆర్ గురించి విమ‌ర్శించినా జ‌నం వింటున్నారు. దీంతో స‌మ్‌థింగ్ రాంగ్ అని కేసీఆర్‌కు అనుమానం వ‌చ్చి మ‌రోసారి స‌ర్వేలు చేయిస్తే… పార్టీ విప‌రీతంగా బ‌ల‌హీన ప‌డిన‌ట్లు, త‌న‌పై ప్ర‌జ‌ల్లో తెలియ‌ని కోపం ఉన్న‌ట్లు అర్థ‌మైంద‌ట‌. అందుకే రూటు మార్చి, స్వ‌రం తగ్గించి.. ప్ర‌జ‌ల‌ను బ‌తిమాలుకుంటున్నాడు.
ఈరోజు బాల‌కృష్ణ తెలంగాణ‌లో ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన ప్ర‌సంగాల‌కు కూడా భారీ స్పంద‌న వ‌చ్చింది. జ‌నం స్వాగ‌తంతో అద‌ర‌గొట్టారు. వారిని చూసిన బాల‌య్య మ‌రింత ఉత్సాహంగా ప్ర‌సంగించారు. ” చంద్రబాబు కట్టిన బిల్డింగుల్లో మీటింగ్స్ పెట్టుకుంటూ కేసీఆర్ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. హైదరాబాద్కు సైబరాబాద్ క‌లిపి మ‌హాన‌గ‌రంగా సృష్టించింది చంద్రబాబు. ఇది చ‌రిత్ర చెప్పే స‌త్యం. తెలుగుదేశం ఒక కులానికి పుట్టిన పార్టీ కాదు. తెలుగు వాళ్ల కోసం పుట్టిన పార్టీ. తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వాళ్లకి తగిన బుద్ది చెప్పండి…* అంటూ జంపింగ్‌ల‌కు ఒక పంచ్ కూడా వేశారు.
ఈ సంద‌ర్భంగా బాహుబలి సినిమాను ఉద‌హ‌రించారు బాల‌య్య‌. బాహుబ‌లి చూశారుగా.. సినిమాలో రాజు భళ్లాలదేవుడే. కానీ ప్రజలందరూ న‌మ్మేది, వెంట న‌డిచేది బాహుబలితోనే అని వ్యాఖ్యానించారు బాల‌య్య‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.