కట్టుతో అసెంబ్లీకి వచ్చిన బాలయ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. వైకాపా నేతలు గతంలో లాగానే సభలకు డుమ్మా కొట్టగా… టీడీపీ, బీజేపీ నేతలు సమావేశాలకు వచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేతి కట్టుతోనే అసెంబ్లీలో అడుగు పెట్టడంతో అంతా విస్తుబోయారు. గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్‌లో బాలయ్య కుడిభుజానికి గాయమైంది. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినా వెరవకుండా సినిమాల షూటింగ్స్ పూర్తి చేశారు. అదే సమయంలో హిందూపురం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా.. ఆయన చేయినొప్పి తిరగబెట్టింది. వెంటనే వైద్యుల సూచనతో ఆయన హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స  చేయించుకున్నారు. 
అయినా సరే చేతి కట్టుతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు బాలయ్య. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా బాలయ్యను పరామర్శించారు. మీడియా ప్రతినిధులు బాలయ్యను కుశల ప్రశ్నలు అడిగి ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రారంభమయ్యే సినిమా షూటింగ్ ను ఈనెల 29న ప్రారంభించనున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఆ సినిమాకు ఎన్టీఆర్ పేరునే పెట్టిన సంగతి తెలిసిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.