బాబుకు గుబులు పుట్టిస్తున్న జగన్, పవన్

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ సుడిగాలి పర్యటనలు ఒకవైపు.. జనసేనాని పవన్‌కళ్యాణ్‌ గోదావరి జిల్లాల పర్యటనలు మరోవైపు… రెండూ కలిసి టీడీపీ అధినేతలో గబులు పుట్టిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది! ఈ నేపథ్యంలో బాబు కూడా యాత్రలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ఇటవలే తూర్పుగోదావరి జిల్లాలో ముగిసింది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టి కేంద్రీకరించారని సమాచారం. ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకున్న పవన్‌ నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరి యాత్రలు ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో విషయం టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల్లో టీడీపీ పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వారం వారం పోలవరం సందర్శనకు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారట! కాగా జగన్ పాదయాత్రకు జనాలు విపరీతంగా తరలిరావడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటించిన ప్రతిచోటా ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో జనం తరలివచ్చారు.
మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కు ఈ జిల్లాలో ఫ్యాన్‌ఫాలోయింగ్‌ అధికంగానే ఉంది. కాపు సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరిలో అదే సామాజికవర్గానికి చెందిన పవన్‌కు స్వాగతం పలికేందుకు కులనేతలు ముమ్మర సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జగన్‌కు సైతం కాపులు బ్రహ్మరథం పడుతున్నారు. కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న గ్రామాల్లో జగన్‌కు ఉన్న ఆదరణ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారట. కాపుల ఆదరణతో జగన్‌కు వచ్చే ఎన్నికల్లో మేలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్‌ ఇక్కడ పర్యటనలకు దిగితే జరిగే పరిణామాలపై తెలుగుదేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోందని తెలుస్తోంది. కాపులను బీసీ జాబితాలో చేర్చకపోవడంతో చంద్రబాబుపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయం విదితమే! ఇదే సమయంలో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్‌ కాపుల రిజర్వేషన్లకు అనుకూలంగా తన వాదన వినిపించారు. పవన్‌కళ్యాణ్‌ సైతం కాపులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అటు జగన్‌, ఇటు పవన్‌ల హవాను ఎలా నియంత్రించాలనే దానిపై చంద్రబాబు ఈ ప్రాంత నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.