బాబు ఒకవైపు జనసేన, జగన్ సేన, కాషాయదళం మరోవైపు

అప్పుడు చంద్రబాబు, పవన్, మోడీ ఒక్కటే. ఇప్పుడు జగన్, పవన్, మోడీ ఒక్కటయ్యారంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర. అధికారికంగా జనసేన, జగన్ సేన, కాషాయ దళం ఒక్కటి కాకపోయినా చంద్రబాబు అంటే వారికి పొసగడం లేదు. ఏపీకి హోదా కోసం వారు పోరాడుతామని చెబుతున్నా…నమ్మబుద్ది కావడం లేదు. పైకి హోదా పోరాటం అని చెబుతున్నా..లోపల సహకరిస్తుండటమే ఇందుకు కారణం. గతంలో చంద్రబాబు ఇలానే చేశారు. ఇప్పుడు జగన్ పార్టీ అంతకు మించిన డ్రామాను క్రియేట్ చేస్తోంది. లేస్తే ప్రధాని కార్యాలయం వద్దకు వెళతారు విజయసాయిరెడ్డి. బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం పెడతారు. కానీ వెళ్లి కలిసేది మాత్రం అదే పార్టీతో. ఫలితంగా వైకాపా బీజేపీకి సహకరించేందుకే తీర్మానం పెట్టిందా లేక మరేదైనా కారణముందా అనేది ఆసక్తికరంగా మారింది. 
రానున్న కాలంలో జేడీ లక్ష్మీనారాయణను తమ కూటమిలో కలుపుకునేందుకు పవన్, బీజేపీ, జగన్ సేన మంతనాలు జరుపుతోంది. ఫలితంగా ఏం జరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. రోజు రోజుకు చంద్రబాబు తన వాడి వేడిని పెంచుతున్నారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రానికి సలామ్ కొట్టిన నేత ఇప్పుడు తప్పు తెలుసుకుని దారిలోకి వచ్చారు. కాకపోతే నాలుగేళ్ల తర్వాత గాడిలోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు హోదా పై రకరకాలుగా మాట్లాడిన మాటలను విపక్షాలు హైలెట్ చేస్తుండగా..ఇప్పుడు పవన్, జగన్ చేస్తున్న సంగతులను టీడీపీ బయట పెడుతోంది. ఫలితంగా జనాలు అయోమయంలో పడి పోయారు. ఎవరు నిజమైన నేతలు అన్నది చర్చనీయాంశమైంది. ఎవరు తక్కువ కాదు. అంతా ఒక తాను ముక్కలే అనే వాదన లేకపోలేదు. కాకపోతే ఇందులు ప్రధాని దోషిగా ముద్రపడింది మాత్రం బీజేపీనే. ఏపీకి నిధులు ఇవ్వడం లేదని బలంగా నమ్ముతున్నారు జనాలు. కాబట్టి అది ఎన్నికల మీద ప్రభావం చూపనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.