బాబు దెబ్బ మామూలుగా లేదుగా!

ముప్పేట దాడికి చెక్‌.. విమ‌ర్శ‌ల‌కు స‌రైన స‌మాధానం. అన్నింటికీ క‌లిపి సీఎం చంద్ర‌బాబునాయుడు.. అటు కేంద్రానికి.. ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కోలుకోలేని దెబ్బేశాడు. ఊహించ‌ని విధంగా రాత్రికి రాత్రే వెలువ‌డిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయంగా.. టీడీపీను మ‌రో మెట్టుకు చేర్చింది. జాతీయ‌స్థాయిలో కూడా మోదీకు స‌రైన ధీటుగా జ‌వాబు ఇవ్వ‌ద‌గ్గ నేత ఓన్లీ చంద్ర‌బాబు మాత్ర‌మే అనే సంకేతాలు పంపిన‌ట్ట‌యింది. ఇప్ప‌టి వ‌కూ ఒక్క‌దెబ్బ‌కు.. రెండు పిట్ట‌లు అనే సామెత తెలుసు.. పోల‌వరం విష‌యంలో బాబు ఇచ్చిన షాక్‌తో ఒన్ షాట్‌.. హండ్రెడ్ బర్డ్స్ అంటూ కొత్త అర్ధాలు వెతుక్కోవాల్సిందేనంట తెలుగు త‌మ్ముళ్లు తెగ ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారు. ఓ ర‌కంగా.. మ‌హానాడును మించిన సంబ‌రం.. ఈరోజు టీడీపీ శ్రేణుల్లో క‌నిపిస్తుంది. కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా.. అప్పుల త‌ల‌నొప్పులుగా ఇబ్బందిపెడుతున్నా.. ప్ర‌పంచంలో చైనా స‌ర‌స‌న‌,, రికార్డు స‌మ‌యంలో పోల‌వరం కాపర్ డ్యాం నిర్మాణం.. అంత‌ర్జాతీయ స్థాయిలో న‌వ‌యుగ ప్ర‌తిష్ఠ‌ను చేర్చింద‌నే చెప్పాలి.

 

గోదావ‌రి న‌దిపై  నిర్మిస్తున్న పోల‌వ‌రంపై ప‌నుల‌ను గ‌తేడాది  ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు షురూ చేశారు. కేవలం 412 రోజుల వ్య‌వ‌ధిలో రూ.450 కోట్ల మేర వెచ్చించారు. గోదావ‌రి న‌దీగ‌ర్భంలో డ‌యాఫ్ర‌మ్‌వాట్ నిర్మాణం చేశారు. వాస్త‌వంగా ఇది.. ప్రాజెక్టుకు పునాది వంటిది.. దీనితో ప్రాజెక్టు నిర్మాణం. వేగం పుంజుకున్న‌ట్లే. దీనికి ప్లాస్టిక్ కాంక్రీట్ వాడ‌టంతో  ఎటువంటి ప‌రిస్థితుల‌ను అయినా త‌ట్టుకోగ‌ల సామ‌ర్థ్యం వ‌చ్చింది. ఇక్క‌డ 200 టీఎంసీల వ‌ర‌కూ నీటిని నిల్వ చేసే వీలుంది. దీన్నే ఈ రోజు చంద్ర‌బాబు జాతికి అంకిత చేయ‌బోతున్నారు. పైలాన్ ను ప్రారంభిస్తారు. ఈ మాత్రం ప‌నులు జ‌రిగితే చాలు.. మిగిలిన అభివృద్ధి పెద్ద క‌ష్ట‌మేం కాద‌నేది ఇంజ‌నీరింగ్ నిపుణులు, నీటిపారుద‌ల నిపుణుల అభిప్రాయం. దీంతో వైసీపీ నోటికి బ్రేకులు వేసే అవ‌కాశం టీడీపీ వైపు వ‌చ్చిన‌ట్ట‌యింది.  ఓ విధంగా చంద్ర‌బాబు.. మౌనం వెనుక‌.. ఏదో మర్మం ఉంద‌ని భావించినా.. అది తెలుగుజాతి కిలుకితురాయి.. జాతి మొత్తానికి సంబంధించిన పోల‌వరం అనేట‌షా ప్ర‌భుత్వం ఒత్తిడితో.. ఇది స‌గంలోనే ఆగుతుందంటూ జ‌బ్బ‌లు చ‌ర‌చుకుని. రాజ‌కీయంగా వాడుకునేందుకు రెడీ అయిన నేత‌లూ ఉన్నారు.

 

అయినా. వీట‌న్నింటినీ వెనుక‌కు నెట్టేసి.. చెప్ప‌పెట్టున అన్న‌ట్లుగా బాబు న‌డిపిన వ్యూహం.. వేసిన పాచిక వర్క‌వుట్ అయింది.. టీడీపీకు గ‌డ్డుకాలం అన్న నోటి నుంచే.. ముందుంది.. మంచికాల‌మే అన్నంత వ‌ర‌కూ చేర్చారు. అయితే.. దీన్ని నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త మాత్రం తెలుగు త‌మ్ముళ్ల‌కే వ‌దిలేశారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.