పవన్ ను చంద్రబాబు అడ్డుకున్నారట

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తానంటే సిఎం చంద్రబాబు ఆపారట. ఆ సంగతి తీరిగ్గా ఇప్పుడు చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మీరు ఉద్యమం చేస్తే ఏపీకి పెట్టుబడులు రావు. ఆ పని చేయకండి అని ఆపారట. చంద్రబాబు నిజం చెబుతున్నాడని ఆగారట. ఇప్పుడు బస్సు యాత్రలో భాగంగా ఆ సంగతి ప్రజలకు చెబుతున్నారు పవన్. అంతే కాదు…ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి మోసపోయానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. గత ఎన్నికలలో పోటీచేయకపోవడం తప్పు అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అది చారిత్రక తప్పిదంలా భావిస్తున్నారు పవన్.
కొన్ని సీట్లు వచ్చి ఉంటే అసెంబ్లీలో నిలదీయగలిగేవారమని బాధపడని రోజు లేదట. పవన్‌ మారిపోయాడని చంద్రబాబు అంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆయనే ఇప్పటికి 36సార్లు మాట మార్చారు. నేను విశాఖలో ప్రత్యేకహోదాపై ఆందోళన చేస్తానంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావంటూ ఆపారు. హైదరాబాద్‌లా అమరావతిలో మళ్లీ కేంద్రీకృత అభివృద్ధి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక భద్రత అంతా అమరావతి ప్రాంత నాయకుల వద్దనే ఉంటే మిగతావారంతా అడుక్కుతింటారా’ అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు.
రెండు రోజులు రిసార్ట్ లో మరో రెండు రోజులు ప్రజల వద్దకు వచ్చి చంద్రబాబును తిట్టేందుకు పవన్ సమయాన్ని వెచ్చిస్తున్నారంటున్నారు. అంతగా చంద్రబాబు మీద కసిగా మాట్లాడుతున్నారు పవన్. గతంలో జగన్ అలా మాట్లాడేవారు. ఇప్పుడు జగన్ పాత్రను పవన్ తీసుకున్నాడంటున్నారు. ఒకరు చెబితే మాత్రం…ఆగుతారా…ప్రజల కోసం ఉద్యమం చేయాలి. అంతేగానీ…బాబు అడ్డుకున్నాడు. వాళ్ల కొడుకు అపారనే మాట చెప్పడం వృధా ప్రయాస మాత్రమే. ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం వద్దకు వెళ్లి హోదా కోసం పోరాడతానని చెప్పారు. తీరా అక్కడకు వెళ్లలేదు. వారిని అడగలేదు. అంతా మాటల మాయ తప్ప పవన్ ఏం చేయలేకపోయారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు చేసిన పనులు బేష్ అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎన్నికల వేళ విమర్శలు గుప్పించడంతో నిజామా కాదా అనే సందేహాలు ముసురుకున్నాయి. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.