అమిత్‌షాతో మాట్లాడేందుకు బాబు సుముఖంగాలేడా..!

ప్రత్యేక హోదా పేరు చెప్పగానే అప్పట్లో కాంగ్రెస్‌పై కోపం వచ్చేది ఇప్పుడు మాత్రం ఏపీ ప్రజలు నిస్సందేహంగా బీజేపీపై కస్సుమంటున్నారు. ప్రస్తుతం ఆ స్థాయిలో వాతావరణ మారిపోయింది. ఇలాంటి సమయంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకి లాభామా.. నష్టమా అనే డైలామాలో సీంఎ చంద్రబాబు పడిపోయారు. అందుకే ఎటు తేల్చుకోలేక ఇటు హాయ్‌ చెప్పలేక అటు బాయ్‌ చెప్పలేకుండా ఉన్నారు. ‘బీజేపీని కాదని మీకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయా…?’ ఇది సాక్ష్యాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైజాగ్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులో చంద్రబాబుని నేరుగా అడిగారని తెలుస్తోంది. దానికి బాబు సైతం చాలా స్పష్టంగా ‘రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఇవ్వాల్సినవన్నీ ఇస్తే మాకేం ఇబ్బంది లేదు’ అని సమాధానం ఇచ్చారని సమాచారం. మొన్న పార్లమెంట్‌లో ప్రకటించినవి వెంటనే అమలు చేస్తే అభ్యంతరాలు లేవుకదా.. అని వెంకయ్య మరోసారి రెట్టించి అడిగారు.. లేవని బాబు చెప్పాడు. అంతే అమిత్‌షాని ఈ విషయంలో స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీపై మీకైమైన ప్రత్యామ్నాయాలున్నాయా? అని అడిగడితే అదేం లేదు చేయాల్సినవి అన్నీ చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, బయటకు వెళ్లేందుకే ప్రస్తుతం ప్రచారం ఆ పార్టీనే చేస్తుంది తప్పా తమకి ఎటువంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారని తెలుస్తోంది. మరి నేరుగా ఈ విషయాన్ని వారితో మాట్లాడి తేల్చొచ్చుకదా.. అని అడిగారట.. సరే నేను కాల్‌ రమ్మని చెబుతా అని అమిత్‌షా బాబుకు ఫోన్‌ చేసి సమావేశాల మొదటి రోజు కలుద్దామని ఆహ్వానించారు. అసలు కథ ఇక్కడే ఉంది. నిజంగా వేరే ఉద్దేశం లేకపోతే వెంటనే ఢిల్లీ వెళ్లి తేల్చేసుకుంటే సరిపోతుంది. కాని ఆయన వెళ్లకుండా సుజనా చౌదరి, రామ్మోహన్‌నాయుడిని పంపాలని నిర్ణయం తీసుకుంది. కలిసుండే ఉద్దేశం ఉంటే అలా ఎందుకు చేస్తారు అనే సందేహం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దాంతో రెండు పార్టీలు విడిపోయే మూడ్ లోకి వచ్చాశాయి అనేది స్పష్టమవుతోంది. తొలిరోజు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, టీడీపీ ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు అనే దానితోపాటు అమిత్ షా తో భేటీ ఎలా జరగనుంది.. బాబు వస్తారా రారా.. లేదా కొంత సమయం తీసుకుని వస్తారా..? అనేవి తేలితే పొత్త విషయం తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.