ప్ర‌త్య‌ర్ధుల పాద‌యాత్రల‌ పై …బాబు నిఘా

పార్టీల నేత‌ల పాద‌యాత్ర‌ల‌తో ఏపీలో రాజ‌కీయ సంద‌డి నెల‌కొంది. వైసీపీనేత జ‌గ‌న్ ఇప్ప‌టికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న చేశారు. తాజాగా గోదావ‌రి జిల్లాలో తిరుగుతున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా జోరుగా పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. రాజ‌కీయాల్లో త‌మ పార్టీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకుంటూ ప్ర‌త్య‌ర్ధుల పై ఓ క‌న్నెసి ఉంటానే సూత్రాన్ని సీనియ‌ర్ నేత‌లంద‌రూ పాటిస్తారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ఈ విషయంలో చాలాప‌గ‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది అంద‌రికి తెలిసిందే.
ప్ర‌త్య‌ర్ధుల పాద‌యాత్ర‌ల‌పై కూడా ఆయ‌న ఇదే విధంగా వ్వ‌హ‌రిస్తున్నార‌ట‌.  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌లువురు టిడిపి నేత‌లు, త‌ట‌స్తులు వైసిపిలో చేరిన సంగ‌తి తెలిసిందే.  కొద్ది రోజుల క్రిత‌మే జ‌గ‌న్ పాద‌యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించింది. దాంతో ఇక మీద‌ట  టీడీపీ నుంచి వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా చూసేందుకు బాబు పార్టీ వ‌ర్గాలు నిత్యం మాట్లాడుతున్నార‌ట‌.
చేరిక‌ల‌పై  నిఘా అధికారుల‌ను చంద్ర‌బాబు పుర‌మాయించార‌ట‌. ఎవ‌రైనా ప్ర‌ముఖులు వైసిపిలో చేరాల‌నుకుంటే అటువంటి వారిని గుర్తించి త‌న‌కు స‌మాచారం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ఆదేశించార‌ని స‌మాచారం. ప్ర‌తీ రోజూ ఏదో ఓ స‌మ‌యంలో దాదాపు 40 నిముషాల పాటు కాన్ఫ‌రెన్సుల‌కు కేటాయిస్తున్నారు. నేత‌ల మ‌ధ్యున్న గొడ‌వ‌లు, నేత‌ల‌పై క్యాడ‌ర్ చేస్తున్న ఫిర్యాదుల‌ను చంద్ర‌బాబు ఓపిక‌గా వింటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో కూడా అధికారంలోకి రాబోయేది టిడిపియేన‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు.  నాయ‌కుల్లో దైర్యం నింపేందుకు. భ‌రోసా ఇచ్చేందుకు ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ప‌వ‌న్ పార్టీకి వ‌ల‌స‌లు లేక‌పోయిన‌ప్ప‌టికి వైసీపీ వైపు కొంత మంది చూస్తున్నార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో సొంత పార్టీని ర‌క్షించుకునే ప‌నిలో బాబు ప‌డ్డార‌ని  రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.