జ‌త‌క‌ట్టే పార్టీల అభ్య‌ర్థుల‌ను సూచిస్తున్న బాబు?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న త‌రుణంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ ఓటమి గురించి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నార‌నే విమ‌ర్శులు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం నుండి అనేక సరికొత్త వ్యూహాలకు అయన తెరలేపుతున్నార‌ని తెలుస్తోంది. ఈ ఎన్నికలు చంద్రబాబుకు కీల‌కంగా మార‌నున్నాయి. కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తన పార్టీలోని నాయకులకు 175 స్థానాల్లో పార్టీ టిక్కెట్లు ఇవ్వడంతోపాటు ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన 23 మంది శాసనసభ్యులకు కూడా టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. ఉన్నది 175 స్థానాలే కాబట్టి అదనంగా ఉన్న 23 మందికి టికెట్లు ఇవ్వకుండా సర్దుబాటు చేసుకోవలసి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. దీనికితోడు తాజాగా తెలుగుదేశం పార్టీలోని అనేకమంది జనసేన వైపు చూస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పొత్తుల విష‌యానికొస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో చంద్రబాబు ఒకదఫా చర్చలు నడిపార‌ని స‌మాచారం.

ఏపీలోని 25 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు నాయుడు సూచించిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తాను సూచించిన 25 మంది అభ్యర్థులకు టికెట్లు ఇస్తే వారి తరపున తానే ఎన్నికల ఖర్చు చూసుకుంటానని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు కాంగ్రెస్ నేతలు అంటున్నార‌ట‌. కాంగ్రెస్‌కు చెందిన నేత‌లు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సీనియర్ నేత తులసి రెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, వట్టి వసంతకుమార్, శైలజానాధ్, రఘువీరా రెడ్డి త‌దిత‌ర‌ పాతిక మంది అభ్యర్థుల పేర్లు చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు చంద్ర‌బాబు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, లోక్ సత్తా వంటి పార్టీ అగ్ర నేతలతో మంతనాలు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. ఆ పార్టీల తరపున అభ్యర్థులను కూడా  బాబు రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నార‌ని భోగ‌ట్టా. ఇప్పటికె బి ఎస్ పి అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత అజిత్ సింగ్ తో చంద్రబాబు మంత‌నాలు జ‌రిపార‌ని తెలుస్తోంది. ఈ పార్టీలకు చెందిన అభ్యర్థులను సూచించడంతో పాటు వారికి నిధులు సమకూర్చే బాధ్యత కూడా చంద్ర‌బాబే తీసుకున్నార‌నే ఆర‌ప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏదిఏమైన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు వ్యూహాలు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయో వేచిచూడాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.