ఏపీలో హీరోగా మారిన చంద్రబాబు

సింహం సీన్ లోకి దిగితే ఎదురుండదు. ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి అలానే ఉంది. ఊరువాడను ఏకం చేసి కేంద్రం పై ఒత్తిడి తెచ్చే పని చేస్తోంది టీడీపీ. అదే సమయంలో బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడికక్కడ బీజేపీ ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేసింది. ఎపికీ హోదా విషయంలో దూకుడుగానే వెళుతోంది టీడీపీ. ఫలితంగా బీజేపీ పై మరింత వ్యతిరేకత పెరుగుతోంది. 
ఏదో ప్రధాని అని గౌరవిస్తే మోడీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మమ్ములనే తొక్కేస్తారా చూసుకుందా రమ్మని సవాల్ విసిరారు చంద్రబాబు. ఫలితంగా ఏపీలో చంద్రబాబు హీరోగా మారాడు. నాలుగు బడ్జెట్లలో ఏపీకి అన్యాయం జరిగింది. మిత్ర పక్షం అని ఊరుకుంది టీడీపీ. అయినా సరే బీజేపీ ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏపీ ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదనేది చంద్రబాబు మాటగా ఉంది. ఏపీ కష్టాలను కేంద్రం పట్టించుకోకపోవడంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టింది. సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారన్న చంద్రబాబు…ఏపీలో కూడా సెంటిమెంట్స్ ఉన్నాయని.. ఇక్కడెందుకు న్యాయం చేయరని ప్రశ్నించారు. 
రాజధాని అవుతుందా…
రూ.15వందల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రధాని అని గౌరవమిస్తే…అందర్ని తనపైకి రెచ్చగొడుతున్నారని బాబు తప్పుపట్టారు. రక్షణ బడ్జెట్‌ అడిగేంత సంస్కార హీనులమా ? మీ ఒక్కరికే దేశభక్తి ఉందా ? మాకు లేదా అని ఘాటుగానే ప్రశ్నించారు. మీరొక్కరే దేశాన్ని కాపాడుతారా మేము కాదా… అని అన్నారు. రెవెన్యూ లోటు కింద రూ.20వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాజధాని రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారు. వారి కోరికను నెరవేర్చాలి. రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా అని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ 15వందల ఎకరాలు చాలంటున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా రాజధాని నిర్మాణం మాత్రం ఆగదన్నారు బాబు. రైల్వే జోన్‌పై కేంద్రం తీరు ఆశ్చర్యకరమన్న బాబు…నాలుగేళ్ల తర్వాత జోన్‌ గురించి ఆలోచించడం దారుణమన్నారు. 
పోలవరం పై…
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. అనేక ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు బాబు. పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించి…రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ…తప్పుడు ప్రచారం సాగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై పవన్‌ కల్యాణ్‌ అవగాహన ఉండి మాట్లాడుతున్నారా ? లేక మాట్లాడుతున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. 
 

5 Comments

  1. అవును. చంద్రబాబు,ఆంధ్రాలోనే కాదు,దేశానికే హీరో అయ్యాడని రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు ఊదర గొట్టేస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఎవరు కమెడియన్, ఎవరు విలన్ అనేది ప్రజలే తేల్చాలి.

  2. You can trick a few people with lies, half truths, false promises, bluffs for sometime. But you can not bluff all people all time. People occupying high positions should be generous, broad hearted and above petty politics.

  3. Andhra lo ayithe kadu.Mari tamilanadu ko lekapothe karnataka lo hero ayyademo theliyadu.CBN eppudu pacha vallaku mathrame hero.Migatha vallu eppudu villan gane chustharu.Last elections lo PK and BJP thoti power loki vachadane vishayam marchipovaddu.

  4. To tell honestly because of TDP no confidence motion it attracted national media and given lot of hype its true. only TDP can dare Modi no other person or people can do this but all political parties must unite together and fight for special status these parties can make their own politics before the elections but not now.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.