చంద్ర‌న్నా… ఇవ‌న్నీ చూస్తున్నావా!

ఏమిటండీ.. ఈయ‌న ధైర్యం.. అందరూ విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. విప‌క్షాలు విరుసుకు ప‌డుతున్నాయి. స్వ‌పక్షంలో వున్న నేత‌లు నోరుజారి.. పార్టీ ప‌రువే కాదు.. ఏకంగా చంద్ర‌బాబునే న‌వ్వుల‌పాలు చేస్తున్నారు. అటువంటి వారిలో చంద్ర‌న్న త‌న‌యుడు లోకేష్‌బాబు కూడా చేర‌టం కాస్త ఇబ్బంది క‌లిగించే అంశ‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే.. 2014లో అంద‌రూ చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌న్నారు. కానీ.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఆయ‌న బ‌లం తెలిసిన వారు మాత్రం.. అబ్బే మునిగిపోయేదేమీలేదు.. సైకిల్ జోరు పెరుగుతుంద‌నే భ‌రోసానిచ్చారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, న‌రేంద్ర‌మోదీ వంటి నేత‌లు చంద్ర‌బాబునాయుడుతో జ‌త‌క‌ట్టేందుకు.. ఇరు వ‌ర్గాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. దాంతోపాటుగానే.. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయం ప్ర‌యోగించిన వాస్త‌వం కూడా దాగుంది. కానీ.. ఏమి చేసైనా.. స‌రే ఆ ఎన్నిక‌లు గెల‌వాల్సిన ప‌రిస్థితి. ఇది కేవ‌లం.. ఒక్క తెలుగుదేశం పార్టీకే కాదు.. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి కూడా.. కీల‌క‌మైన ఎన్నిక‌లు. ప‌దేళ్ల‌పాటు.. ప్ర‌తిప‌క్షంలో టీడీపీ ఉన్న‌పుడు క‌మ్మ వర్గానికి చెందిన నేత‌లు, అధికారులు ఎన్నో చ‌విచూశారు. చివ‌ర‌కు ప‌రిటాల ర‌వీంద్ర వంటి సీనియ‌ర్ నేత‌ను దూరం చేసుకోవాల్సి వ‌చ్చింది.

అటువంటి కీల‌క‌మైన వేళ‌.. చంద్ర‌బాబు త‌లొగ్గినా.. గంట‌ల త‌ర‌బ‌డి ఎదురుచూపులు చూసినా.. ఇన్ని ప్ర‌యోజ‌నాలున్నాయ‌నేది కేవ‌లం సీనియ‌ర్లు మాత్ర‌మే గ్ర‌హించ‌గ‌ల వాస్త‌వం. కానీ.. దాన్ని నిల‌బెట్టేందుకు కేవ‌లం అధినేత మాత్ర‌మే నిల‌బ‌డాల్సిన దుస్థితికి చేర్చారు. ఒక చింత‌మ‌నేని.. ఒక‌. సుజ‌నా చౌద‌రి, ఒక‌.. సీఎం ర‌మేష్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే.. నిన్న‌మొన్న‌.. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కూడా.. ర‌మ‌ణ‌దీక్షితుల‌పై నోరుజారి.. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. తెలుగు భాష‌పై ప‌ట్టులేని లోకేష్ కూడా.. ప‌లు వేదిక‌ల‌పై త‌ప్పుడు సంకేతాలు వెళ్లేలా ప్ర‌సంగిస్తున్నారు. ఇవ‌న్నీ.. టీడీపీను ప్ర‌స్తుతం ఇరుకున పెడుతూనే ఉన్నాయి. మ‌హానాడులో కూడా నేత‌లు దాదాపు.. పార్టీను ప‌క్క‌న‌బెట్టి.. చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆరాట‌ప‌డుతున్న‌ట్లుగా ప్ర‌జ‌ల్లోకి భావ‌న తీసుకెళ్లారు. స్వామిభ‌క్తి ఉండ‌వ‌చ్చు. కానీ అదేస్థాయిలో అధికార పార్టీగా ప్ర‌జ‌ల్లో వున్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించి.. దానికి స‌మాధానం చెప్పేందుకు అనువుగా మ‌ల‌చుకోవాలి. కానీ.. ఇవ‌న్నీ ఏమీలేకుండానే మ‌హానాడును మ‌మ అనిపించార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి చేరేందుకు నేత‌లు కార‌కులయ్యారు. మొన్న డ‌ల్లాస్‌లో న‌ల్ల‌దుస్తుల‌తో చంద్ర‌బాబునాయుడుకు వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌దర్శ‌న ఆందోళ‌న‌కు గురిచేసే అంశం కూడా వీట‌న్నింటినీ స‌రిదిద్ది 2019కు.. శ్రేణుల‌ను స‌రైన మార్గంలో న‌డిపించ‌టం.. చంద్ర‌బాబు ఎదుట వున్న స‌వాల్ అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.