బాబు అంటే జడుపే: ఇదే రుజువు!

చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్రంలోని భాజపా సర్కార్ జడుసుకున్నట్లే కనిపిస్తోంది. ప్రకాష్ జవదేకర్ మరియు కంభంపాటి, జీవీఎల్ కలిసి ఎంతగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ.. ఒక్కరోజు గడిచేసరికెల్లా.. తెరవెనుక కేంద్రంలోని భాజపా ఆడుతున్న డ్రామాలేమిటో.. వారు బాబు పట్ల ఎంతగా భయపడుతున్నారో చెప్పకనే చెబుతున్నాయి. ఢిల్లీలో చంద్రబాబు మీడియామీట్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. కేంద్రం చేసిన వంచనను బయటపెట్టిన తర్వాత.. భుజాలు తడుముకున్న సర్కారు పెద్దలు కౌంటర్ ఇవ్వడానికి చాలా తొందర పడ్డారు. అయితే.. ఢిల్లీలో.. చంద్రబాబు దాదాపు 15కు పైగా జాతీయ మీడియా సంస్థలకు ఏపీ భవన్లో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. వాటిలో కనీసం రెండు టీవీ ఛానెల్స్ వారు చంద్రబాబు తో చేసిన ఇంటర్వ్యూలను ప్రసారం చేయకుండా ఉండాలని కేంద్రం ఆదేశించిందిట. చంద్రబాబు ఢిల్లీ టూర్, ఆయన ప్రచారం చేస్తున్న వాస్తవాల పట్ల మోడీ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదేదో తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేసుకుంటున్న సంగతి కాదు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

చంద్రబాబునాయుడు పార్లమెంటు సెంట్రల్ హాల్లో పలువురు నాయకులతో భేటీ అయిన నేపథ్యంలోనే.. టీఎంసీకి చెదింన డెరెక్ ఓబ్రెయిన్ తో కూడా భేటీ అయ్యారు. తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదంతా  ఒక ఎపిసోడ్ అయితే.. ఢిల్లీలో చంద్రబాబు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చేసిన తర్వాత.. ఆయనకు వ్యతిరేకంగా భాజపా దళాలు ఎలాంటి మీడియా లాబీయింగ్ చేస్తున్నాయో.. ఇప్పుడు డెరెక్ ఓబ్రెయిన్ బయట పెడుతున్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలియడం మోడీ సర్కారుకు ఇష్టం ఉండదని చాలా విమర్శలు  ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ కు చాలా చేసేశాం.. ఇన్ని లక్షల కోట్లు కేటాయించేశాం.. అంటూ కేంద్రప్రతినిధులు కల్లబొల్లి కబుర్లు చెప్పడమే తప్ప.. నిర్దిష్టంగా చట్టంలోని అంశాల వారీగా ఏం చేశారో స్పష్టంగా ఇప్పటిదాకా మాట్లాడలేదు. బాబు ఇంటర్వ్యూలు ప్రజల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా తమ వంచన రచ్చకెక్కుతుందని భాజపా జడుసుకున్నట్లుగా పలువురు పేర్కొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.