చేపలకు కన్నీళ్లు ఉంటాయా…

చేపలకు కూడా క‌న్నీళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటాయ్ కదా! కనపడవంతే. ఈ ఒక్క డైలాగ్ తో అదరగొట్టారు నేచురల్ స్టార్ నాని. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై వస్తున్న సినిమా ‘అ’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. వాస్తవ సంగతుల ఆధారంగా అల్లిన కథనే ‘అ’ మూవీ. ‘నా డైరీలో లాస్ట్‌ ఎంట్రీ. ఈ రోజు నేనో మాస్‌ మర్డర్‌ చేయబోతున్నా’ అనే వాయిస్‌తో ట్రైలర్‌ మొదలవుతోంది. చీకటి, వెలుగును చూపిస్తూ వివిధ పాత్రలను పరిచయం చేసాల సాగిన ట్రైలర్ ఆలోచింపజేసేలా ఉంది. 
ఫ్రిబవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది అ మూవీ. ఈ సినిమాలో నాని ఓ చేపకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. మరోవైపు రవితేజ ఓ మొక్కకు తన గాత్రాన్ని ఇచ్చారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ త్రిపురనేని నిర్మిస్తున్నారు. నలుగురు హీరోయిన్లతో మంచిపాత్రలు దొరకడంతో కథ పై ఆసక్తి పెరుగుతోంది. కొత్తదనంతో పాటు.. వినూత్న మలుపులు తీసుకుంటోంది కథనం. ఫలితంగా అ సినిమా పై అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.