భయపడుతున్న అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు భయపడిపోతున్నాడు. తన వైరి వర్గం నుంచి కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పూజలు చేయించాడు మంత్రి అచ్చెన్నాయుడు. ఆ తర్వాత పూజలు చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అనేక కీలకాంశాలను బయటపెట్టాడు. అప్పటి నుంచి అచ్చెన్నాయుడు జనాల్లోకి రావడం లేదు. ఏపీ మంత్రి అచ్చెన్నని చంపుతామని ఫోన్ కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా సరే మంత్రి ఇంకా కుదుటపడలేదు. మరోవైపు మంత్రికి భారీ భద్రత పెంచారు. టెక్కలి నియోజకవర్గంలోని ఒక జంక్షన్‌ వద్ద మా వాళ్లు.. జిలిటెన్‌ స్టిక్స్‌ ఏర్పాటు చేశారు.. అది తప్పిపోయింది. ఈసారి అచ్చెంనాయుడును విడిచిపెట్టేది లేదని మరోసారి ఓ అజ్ఞాతవాసి హెచ్చరించారు. 
అందుకే అచ్చెన్నాయుడు వెనక్కు తగ్గాడంటున్నారు. ఆ ఫోన్ కాల్ చేసింది ఒరిస్సాలోని రాఘగఢ్‌ వాసి. అక్కడకు వెళ్లిన పోలీసులకు కీలక విషయాలు తెలిసినా అతన్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఒడిస్సా రాష్ట్ర గజపతి జిల్లా ఎస్పీ తో మాట్లాడిన ఏపీ పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్‌ వచ్చిన ప్రాంతానికి వెళ్లారు. కోటబొమ్మాలి నుంచి ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేశారని తెలుసుకున్నారు. ఇప్పుడు అతని కోసం వేట సాగుతోంది. ఈ పని చేసింది అన్నలేనా అనే అనుమానం వస్తోంది. ఎందుకైన మంచిది. కాస్తంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మంత్రి అచ్చెన్నకు చెప్పారట. వారి సూచనలతో వీలున్నంత వరకు ఇంటి గడప దాటకుండా మంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
ఒకవేళ మంత్రి ఎక్కడికైనా వెళితే రాత్రి కాకముందే ఇంటికి వచ్చే పని చేస్తున్నారు. గతంలో టీడీపీ నేత ఎర్రంనాయుడును రోడ్డు ప్రమాదం రూపంలో ప్రత్యర్థులు హతమార్చారనే ప్రచారం వచ్చింది. అచ్చెన్నాయుడు విషయంలోనూ అలాంటి ఘటనలు జరిగే వీలుందనే వాదన లేకపోలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.