ఇదీ.. ఎన్టీఆర్ స్టామినా అంటే..!

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. నాలుగు సూపర్ హిట్ సినిమాల తర్వాత అతడు చేస్తున్న చిత్రం ‘అరవింద సమేత.. వీరరాఘవ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇది విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

చాలా కాలంగా డిఫరెంట్ సినిమాలను చేస్తూ విజయపరంపర కొనసాగిస్తున్న ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న కథను చేస్తున్నాడు. తారక్‌ను మాస్ లుక్‌లో చూసి చాలా కాలం అవడంతో ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారో అచ్చం అలాంటి సినిమానే చేస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. టీజర్ ప్రారంభంలో బ్యాక్ గ్రౌండ్‌లో ‘‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా.. మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటదో తెలుసా.. అంటూ జగపతి బాబు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. ఇక చివర్లో ‘‘కంటబడ్డావా.. కనికరిస్తానేమో.. ఎంటబడ్డనా నరికేస్తా..’’ అంటూ యంగ్ టైగర్ చెప్పే డైలాగ్ అదిరిపోతుంది. అందుకే ఈ టీజర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అతడి సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ‘అరవింద సమేత’ టీజర్ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు విడుదలైన ఈ టీజర్ ఏడు గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇదే కంటిన్యూ అయితే టాలీవుడ్‌లో నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.