1999 ఏప్రిల్ 17 రిపీట్ అవుతుందా!

జ‌గ‌న్ రిజైన్ చేస్తామ‌న్నాడు.. ప‌వ‌న్ సై అన్నాడు.. మంత్రి మాణిక్యాల‌రావు.. కొండ‌కు వెంట్రుక ముడేశాం.. పోతే వెంట్రుకే అంటాడు. పొత్తుకు చివ‌రి ద‌శ‌కు వచ్చింద‌నేందుకు ఇంత‌కు మించి నిద‌ర్శ‌న‌మేం అవ‌స‌రంలేదేమో. అదేదో ఎమోష‌న్ అనుకుంటే.. టీడీపీ వాళ్లు కూడా.. వైసీపీతో చీక‌టి పొత్తు పెట్టుకుని.. మ‌మ్మ‌ల్ని దూరం చేసుకోవాల‌నే ఈ ఎత్తుగ‌డ అంటున్నారు. మాట‌ల యుద్ధం మ‌రింత ప‌రిధులు దాటే అవ‌కాశాలు పెరుగుతున్న నేప‌థ్యంలో.. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఒక్క ఎంపీ వున్నా చాలంటూ.. ప‌వ‌న్ లెక్క‌గ‌ట్టాడు. మీరు చెప్పిన గ‌డువుకే సిద్ధంక‌మ్మంటూ వైసీపీకు అల్టిమేటం ఇచ్చాడు.. జ‌గ‌న్ వీరుడు.. శూరుడు అనుకుంటున్న త‌న‌కు కూడా మ‌రోసారి నేత స‌త్తా చూడాల‌ని ఉందంటూ ప‌రోక్షంగా ఎద్దేవా చేసిన‌ట్లుగానే వైసీపీ నేత‌లు అంచ‌నా వేసుకుంటున్నారు. ఇన్ని భిన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇర‌వై ఏళ్ల‌నాటి సంఘ‌ట‌న పున‌రావృత‌మ‌వుతుందానే అనే అనుమానాలు రాజ‌కీయ ప‌క్షాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 1999లో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది. వాజ్‌పేయి ప్ర‌ధానిగా ఉన్నారు. అటువంటి స‌మ‌యంలో కేవ‌లం ఒకే ఒక్క ఓటుతో ప్ర‌భుత్వాన్నే కుప్ప‌కూల్చారు.. ఆ నాటి త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌. 17 ఏప్రిల్ 1999లో జ‌రిగిన ఇదే ఘ‌ట‌న మ‌రోసారి  వ‌స్తుందా అనేది ఇప్పుడున్న అనుమానం. వాస్త‌వానికి.. త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణ త‌దిత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. దాదాపు ఎన్‌డీఏ స‌ర్కారుపై గుర్రుగానే ఉన్నాయి. మ‌రికొన్నిప్రాంతీయ‌పార్టీలు అవ‌కాశం కోసం చూస్తున్నాయి. ప‌వ‌న్ లెక్క‌ల ప్ర‌కారం 70 మంది ఎంపీలు క‌లిసొస్తారంటున్నారు. మ‌రీ పెరిగితే 100 పెరుగుతుంద‌ని మ‌రో అంచ‌నా. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప‌వ‌న్ ఈ విష‌యాన్ని తెర‌మీద‌కు తెచ్చారా! వైసీపీను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయ‌టం ద్వారా టీడీపీకు ల‌బ్ది చేకూరేలా వ్య‌వ‌హ‌రించారా అనే అనుమానాలు కూడా బ‌ల‌ప‌డుతున్నాయి. వైసీపీ నేత‌లు.. టీడీపీ నుంచి ఎటువంటి మ‌ద్ద‌తు తీసుకోకుండా కేవ‌లం మ‌మ్మ‌ల్నే టార్గెట్ చేసేందుకు ప‌వ‌న్ ఈ డ్రామాలాడుతున్నాడంటూ విమ‌ర్శ‌ల‌కు దిగారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.