ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది.. 22న భూమి పూజ!

ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది. ప్రవాసాంధ్రులు ఎంతగానో ఎదరు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో జూన్ 22న ఏపీ ఎన్‌ఆర్టీ ఐకానిక్ టవర్‌కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలోని రాయపూడి గ్రామంలోని ప్రభుత్వ సముదాయంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఎన్ఆర్టీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏపీ అభివృద్ధికి పాటు పడుతున్న ఎన్ఆర్టీ.. నూతన రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మించాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని అడ్డకుంలు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో వాటిని అధిగమించి ఇప్పుడు ఐకానిక్ టవర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. విదేశీ హంగులతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోయే ఈ ఐకానిక్ టవర్ అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్ఆర్టీ ఇప్పటికే ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఉన్న కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంలో కూడా ఎన్ఆర్టీ కృషి ఉంది. అంతే కాకుండా ఎన్ఆర్టీ పిలుపుతో పలువురు ప్రవాసాంధ్రులు వివిధ గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందు వచ్చారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్టీ ఎంతో తోడ్పాటునిస్తోంది. తాజాగా ఎన్ఆర్టీ చేపట్టిన ఐకానిక్ టవర్ నిర్మాణంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.