“APNRT iCON TOWER”

నవ్యాంధ్రను సిలికానాంధ్రగా చేయాన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా, పనిచేస్తున్న APNRT,  ప్రపంచంలోని 110 దేశాలలో గల 80 వేలమందికి పైగా ప్రవాసాంధ్రులను సభ్యులుగా కలిగి ఉంది.  ప్రవాసాంధ్రులకు ఉచిత బీమా, పుణ్యక్షేత్రాల సందర్శన, పెట్టుబడులు పెట్టటంలో సహకారం వంటి అనేక రకాల సేవలందిస్తూ, వారి ప్రశంశలు చూరగోంటూ మందుకు సాగుతోంది.  ప్రతి సంవత్సరం మన రాష్ట్రానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయలు పంపిస్తూ   రాష్ట్రాభివృధ్దికి సహకరిస్తున్న ప్రవాసాంధ్రులకు  మనం కూడా ఏదైనా చేయాలనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆలోచనుండి వచ్చిన అంకురమే ఈ “iCON  TOWER”

ఈ జూన్ 22 న  రాజధాని అమరావతి లోని రాయపూడి గ్రామంలో గల గవర్నమెంట్ కాంప్లెక్స్ లో  మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఈ భవనానికి భూమిపూజ నిర్వహించనున్నారు. అనేక పలువురు ప్రముఖులతో పాటు, అనేక దేశాలనుండి ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గోననున్నారు.

ప్రపంచంలోని పలుప్రాంతాలలో స్ధిరపడ్డ నాన్ రెసిడెంట్ తెలుగువారిని గుర్తు చేస్తూ,   ఆంధ్ర ప్రదేశ్ కిరీటంలో చేర్చిన కలికితురాయి గా ఈ  NRT ICON TOWER ని   అభివర్ణించటం అతిశయోక్తి కాదు.   నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, షాపింగ్ కాంప్లెక్స్ లతో కూడిన ఈ సముదాయం అమరావతి కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ప్రపంచ స్ధాయి నిర్మాణ రీతిలో, అమరావతి లోని ప్రభుత్వ కార్యాలయ సముదాయాల మధ్య నిర్మిస్తున్న ఈ టవర్ ను  EXO SKELTEN  విధానంలో నిర్మిస్తున్నారు. సాంప్రదాయక విధానంలో ఫ్లోర్ ల మధ్యలో అడ్డంగావచ్చే కాంక్రీట్ పిల్లర్లు, కాలమ్స్ ఈ విధానంలో ఉండకపోవటం వల్ల, 6 శాతం స్ధల లభ్యత పెరగటమే కాక, ఆకర్షణీయంగా కూడా ఉండనుంది.  నిర్మాణ సమయం కూడా అతి తక్కువగా ఉండటం ఈ EXO SKELTEN  విధానం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

400 నుండి  500 కోట్ల రూపాయల అంచనాతో, 5 ఎకరాలలో నిర్మించనున్న ఈ 33 అంతస్తుల భవనం, 1 లక్షా8 వేల చదరపు మీటర్ల స్ధలాన్ని అందిస్తుంది.  గ్రీన్ బిల్డింగ్ విధానంలో పర్యావరణానికి అనుకూలంగా నిర్మిస్తుండటం వల్ల, అన్ని ఫ్లోర్ లలోను ఉద్యానవనాలు ఉండి, ఉష్ట్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. ఈ భవంతిలో నివాస సముదాయాలు,  షాపింగ్ కాంప్లెక్స్ లు, గేమింగ్ జోన్స్, ఓపెన్ ఎయిర్ ధియేటర్లు, కన్వెన్షన్ హాల్స్, రెస్టారెంట్ల వంటి సదుపాయాలు ఏర్పాటుచేయనున్నారు.  

మధ్యలో ఉండే గ్లోబ్ వంటి ఆకారంలో ఏర్పాటుచేయనున్న Revolving Restaurent ఈ భవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ ను గుర్తు చేస్తూ, A  ఆకారంలో ఉండే ఈ టవర్ లో  మురుగునీటి శుధ్ది కేంద్రం ఉండటంవల్ల, ఆ శుధ్ది చేసిన నీటిని భవనంలోని మోక్కలకు వాడే అవకాశం కలుగుతుంది.        

పూర్తిగా ఎన్.ఆర్.టి ల నిధులతో, వారికోసమే నిర్మించనున్న ఈ  NRT ICON TOWER వల్ల 5 వేలమందికి  ఉద్యోగాలు లభించగలవని ప్రభుత్వం అంచనాలు తెలుపుతున్నాయి. ఈ భవనంలోని నివాస, కార్యాలయ ప్రాంతాలను  కేవలం ఎన్.ఆర్.టి లకు మాత్రమే విక్రయించాలని APNRT  నిర్ణయించగా, తమకు అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటికి 500కు పైగా  విజ్ఞప్తులు వచ్చాయి.

ప్రవాసాంధ్రులు మన రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో అందిస్తున్న తోడ్పాటుకు ప్రతిగా, వారికోసం ఏదైనా లనే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబునాయుడు ఆలోచనలకు ప్రతి రూపమే ఈ NRT iCON TOWER అని APNRT ప్రెసిడెంట్  Ravi P Vemuru తెలిపారు.  NRT లకు రాజధాని ప్రాంతంలో ఓక నివాస ప్రాంతాన్ని అందుబాటులోకి తేవటం, అదే సమయంలో వారు అక్కడే తమ కంపెనీలు కూడా ఏర్పాటుచేసేలా, ఇక్కడి వారికి ఉద్యోగాలు కల్పించేలా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.  ఐకాన్ టవర్ ముందు 50 అడుగుల ఎత్తున్న 40 దేశాలకు చెందిన పతాకాలతో నిర్మించిన పెవిలియన్ ఈ ఐకాన్ టవర్  Internation Theme ను అందిస్తుందని ఆయన వివరించారు. 

(మరిన్ని వివరాలకోసం  http://icon.apnrt.com/)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.