అమెరికాకు భార‌త్ నోటీసు!… స్టూడెంట్స్‌కు ఏపీఎన్నార్టీ అండ‌!

university of farmington

అమెరికా క‌ల‌ను సాకారం చేసుకునేందుకు వెళ్లి న‌డి సంద్రంలో కొట్టుమిట్టాడుతున్న భార‌త విద్యార్థులు, ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థుల‌కు సంబంధించి రోజుకో కొత్త ప‌రిణామం చోటుచేసుకుంటోంది. అమెరికా పోలీసులు నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్‌కు అడ్డంగా బుక్కైన 8 మంది బ్రోక‌ర్ల‌తో పాటు వారి ద్వారా న‌కిలీ వ‌ర్సిటీ ఫార్మింగ్ట‌న్‌లో చేరిన వంద‌లాది మంది విద్యార్థుల‌ను అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే బ్రోక‌ర్ల‌తో పాటు వారి చేతిలో మోస‌పోయిన విద్యార్థుల‌ను కూడా ఎలా అరెస్ట్ చేస్తారంటూ భార‌త సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం, అక్క‌డే మంచి ఉద్యోగం కోరుకోవ‌డం త‌ప్పేమీ కాదు క‌దా అన్న వాద‌న‌ను తెర మీదకు తెచ్చిన తెలుగు సంఘాలు అరెస్ట‌యిన విద్యార్థుల‌కు బాస‌ట‌గా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త విదేశాంగ శాఖ కూడా దీనిపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అమెరికా స‌ర్కారు త‌ప్పిదం కూడా ఉంద‌న్న కోణంలో ఏకంగా ఆ దేశానికి నోటీసులు జారీ చేసింది.

బ్రోక‌ర్ల చేతుల్లో మోస‌పోయిన విద్యార్థుల‌కు అండ‌గా నిల‌వాల్సిన అమెరికా పోలీసులు… బాధితుల‌నే అరెస్ట్ చేయ‌డం ఏమిట‌న్న కోణంలో కాస్తంత గ‌ట్టిగానే స్పందించిన భార‌త విదేశాంగ శాఖ ఈ నోటీసుల‌ను జారీ చేసింది. ఈ నోటీసుల ప్ర‌కారం భార‌త్ లో అమెరికా రాయ‌బారి… భార‌త విదేశాంగ శాఖ‌, ప్ర‌ధాన‌మంత్రిత్వ కార్యాల‌యం ముందు హాజ‌రు కావాల్సి ఉంది. రెండు దేశాల మ‌ధ్య ఉన్న దౌత్య ఒప్పందాల‌కు అనుగుణంగానే విదేశాంగ శాఖ ఈ నోటీసుల‌ను జారీ చేసింది. బాధిత విద్యార్థుల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయ‌డంతో పాటుగా చ‌ట్ట‌బ‌ద్ద యూనివ‌ర్సిటీల్లో ప్ర‌వేశాలు ద‌క్కేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా భాత‌ర విదేశాంగ శాఖ అమెరికాకు సూచించ‌నుంది. మ‌రోవైపు త‌మ‌ది కాని త‌ప్పుకు దేశం కాని దేశంలో చ‌దువు కోసం వెళ్లి జైలు పాలు కావ‌డంతో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌లో కూరుకుపోయారు. మూడు రోజుల నుంచి జైల్లోనే గ‌డుపుతున్న విద్యార్థులు స‌రైన ఆహారం లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసులు… బాధిత విద్యార్థుల‌కు బీఫ్‌, పోర్క్ త‌ర‌హా మాంసాహారాన్ని మాత్ర‌మే అందిస్తున్నార‌ని, దీంతో శాకాహారులైన విద్యార్థులు మూడు రోజుల నుంచి ప‌స్తులే ఉంటున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌తో ఇక్క‌డ ఉంటున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అటు విద్యార్థుల‌తో పాటు ఇటు విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు భ‌రోసా ఇస్తూ ఏపీఎన్నార్టీ రంగంలోకి దిగింది. అరెస్టైన విద్యార్థులకు మ‌ద్ద‌తుగా తామున్నామ‌ని, విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌ని రీతిలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఏపీఎన్నార్టీ అధ్య‌క్షుడు, విదేశీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక స‌ల‌హాదారు డా. ర‌వికుమార్ వేమూరు చెప్పారు. విద్యార్థుల‌కు ఏదో జ‌రుగుతుంద‌ని వారి త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని, అమెరికా వ్యాప్తంగా ఏపీఎన్నార్టీ స‌భ్యులు విద్యార్థులకు అండ‌గా ఉంటార‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. బాధిత విద్యార్థులు ఏపీఎన్నార్టీ వెబ్ సైట్‌లోని త‌మ ప్ర‌తినిధుల నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి స‌హ‌కారం తీసుకోవ‌చ్చ‌ని కూడా ఆయ‌న సూచించారు. ఇదిలా ఉంటే… వీకెండ్స్ నేపథ్యంలో అమెరికా అధికారులు అందుబాటులో ఉండ‌ర‌ని… సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. అమెరికాలో అవ‌స‌ర‌మైన సాయం అందించ‌డంతో పాటు ఇండియాకు వ‌చ్చాక అమ‌రావ‌తిలోని ఇంట‌ర్నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లో నైపుణ్య శిక్ష‌ణ కూడా ఇచ్చి వారు మ‌రోసారి మంచి యూనివ‌ర్సిటీల్లో సీటు పొంద‌డానికి అవ‌స‌ర‌మైన స్కిల్స్ నేర్పించ‌డానికి ఏపీ ఎన్నార్టీ సిద్ధంగా ఉంద‌ని డాక్ట‌ర్ ర‌వికుమార్ వేమూరు చెప్పారు. ఇదిలా ఉండగా ఇండియ‌న్ కాన్సులేట్ అధికారుల‌తో పాటు ఏపీ ఎన్నార్టీ బృందం డాల‌స్ డిటెన్ష‌న్ ఫెసిలిటీలో 11 మంది విద్యార్థుల‌ను నిన్న‌నే క‌లిసి మాట్లాడింది. ఇక తెల‌గు విద్యార్థులు తెలంగాణ‌-ఆంధ్ర తేడా లేకుండా ఏపీ ఎన్నార్టీ అండ‌గా ఉండి, అవ‌స‌ర‌మైతే న్యాయ స‌హాయానికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను ఏపీఎన్నార్టీ అత్య‌వ‌స‌ర నిధి నుండి వాడుకోమ‌ని ముఖ్య‌మంత్రి ఇటీవ‌లే సూచించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.