ఆంధ్రా వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం లేదు… సీఎం ప‌ద‌వి కావాలా జ‌గ‌న్?—బుచ్చి రామ్ ప్రసాద్

వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పై జ‌రిగిన క‌త్తి దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు తెర‌పైకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌త్తితో దాడి జ‌ర‌గ‌గానే జ‌గ‌న్ …విశాఖ‌లో చికిత్స ఎందుకు తీసుకోలేద‌ని ప‌లువురు ప్రశ్నిస్తున్నారు. అదీగాక జ‌గ‌న్ …ఆ చిన్న‌పాటి గాయంతో హైద‌రాబాద్ వెళ్లిపోయి అక్క‌డ హాస్ప‌ట‌ల్ లో హైడ్రామా మొద‌లు పెట్ట‌డంపై కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, కేంద్రం అధీనంలో ఉన్న విమానాశ్ర‌యంలో దాడి జ‌రిగినా….ఏపీ పోలీసుల భ‌ధ్ర‌తా వైఫ‌ల్యం అంటూ వైసీపీ నేత‌లు నానా హంగామా చేయ‌డం పై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, త‌మ‌కు ఆంధ్రా పోలీసుల‌పై న‌మ్మ‌కం లేదంటూ వైసీపీ నేత సుబ్బారెడ్డి వంటి వారు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లిచ్చేశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు, జ‌గ‌న్ తీరుపై ఏపీఎన్ ఆర్ టీ చీఫ్ కో ఆర్డినేట‌ర్ బిచ్చి రామ్ ప్ర‌సాద్ మండిప‌డ్డారు. జ‌గ‌న్ కు ఆంధ్రా పోలీసులు, ఆంధ్రా హాస్ప‌ట‌ళ్ల‌పై న‌మ్మ‌కం లేద‌ని, కానీ రాబోయే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న ఆంధ్రాకు సీఎం కావాల‌ని క‌ల‌లు గంటున్నార‌ని రామ్ ప్ర‌సాద్ దుయ్య‌బ‌ట్టారు.

ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం రెండూ ప్ర‌జాస‌మ‌స్య‌లు, ప‌థ‌కాల గురించి చ‌ర్చ జ‌రుపుతాయి. ప్రజాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షం స‌హేతుక‌మైన స‌ల‌హాలు…సూచ‌న‌లు ఇవ్వ‌డం… ప‌థ‌కాల తీరును ప్ర‌శ్నించ‌డం వంటివి చేస్తుంటుంది. కానీ, ఏపీలో మాత్రం దేశంలో ఎక్క‌డా లేని భిన్న‌మైన ప‌రిస్థితి ఉంది. బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న వైసీపీ …అసెంబ్లీని శాశ్వ‌తంగా బాయ్ కాట్ చేయ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా…దేశంలో వైసీపీ త‌ర‌హాలో అసెంబ్లీని బ‌హిష్క‌రించిన పార్టీ మ‌రోటి లేదేమో.
నిజానికి ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షానికి అసెంబ్లీ ఓ వ‌రం. అధికార పార్టీకి లేని వాద‌న బ‌లం అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షానికి ఉంటుంది. ఎందుకంటే ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా మంత్ర దండం ఉప‌యోగించి అన్నిటినీ పూర్తిగా మార్చేయ‌డం అనేది సాధ్యం కాదు. జ‌గ‌న్ స్థానంలో వేరే ఎవ‌రైనా అనుభ‌వ‌జ్ఞుడు ఉండుంటే క‌చ్చితంగా బ‌హిష్క‌రించేవారు కాదు. కానీ త‌న అనుభ‌వరాహిత్యం వ‌ల్ల ఆ అవ‌కాశాన్ని వాడుకోక‌పోవ‌డ‌మే కాకుండా, ప్ర‌జాస్వామ్యాన్ని కూడా జ‌గ‌న్ అగౌర‌వ‌ప‌రిచారు అని రాంప్ర‌సాద్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్రాలోని వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం లేని వ్య‌క్తి, ప్ర‌జాస్వామ్యంపై అవ‌గాహ‌న, గౌర‌వం లేని వ్య‌క్తి సీఎం ప‌ద‌విని ఆశించ‌డ‌మే విచిత్ర‌మని రాంప్ర‌సాద్ ఆరోపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.