ఏపీ ఎన్ఆర్‌టీ.. అక్ష‌ర వెలుగులు!

చేప‌లు ఇవ్వ‌టం కాదు.. చేప‌లు ప‌ట్ట‌డం నేర్పిస్తే.. గొప్ప అనేది పాత సామెత‌. అన్న‌దానం.. ఒక్క‌పూట క‌డుపునింపుతుంది. అదే విద్యాదానం.. జీవితానికి స‌రిప‌డినంత ధైర్యాన్ని.. స‌మాజ అభివృద్ధికి మార్గం వేస్తుంది. ప్ర‌ముఖ ప్ర‌వాసాంధ్రుల సంస్థ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీ ఎన్ ఆర్‌టీ) ఉన్న‌త ఆశ‌యం వైపు అడుగులు వేసింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులోని సంస్కృత గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ హైస్కూల్‌ను ద‌త్త‌త తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను 2029 నాటికి సంపూర్ణ అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా  మార్చే ల‌క్ష్యంతో తాము పాఠ‌శాల‌ల ద‌త్త‌త‌కు శ్రీకారం చుట్టిన‌ట్టు ఏపీఎన్ఆర్ టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ర‌వి వేమూరు తెలిపారు.
1962లో స్థాపించిక కొవ్వూరు పాఠ‌శాల‌లో సంస్కృతం ప్ర‌ధాన భాష‌గా బోధిస్తారు. దేవ‌త‌లు మాట్లాడే భాష‌గా సంస్కృతానికి పేరుంది. ఈ ఒక్క భాష నేర్చుకోవ‌టం ద్వారా.. ప్ర‌పంచ భాష‌ల‌ను తేలిక‌గా ఔపాస‌న ప‌ట్ట‌వచ్చ‌నేది ప‌లు ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నాల్లో కూడా గుర్తించారు. ఇప్ప‌టికీ ప‌లు ఆధ్యాత్మిక‌, ఆరోగ్య‌, శాస్త్ర ప‌రిశోధ‌న గ్రంథాలు. అదే భాష‌లో ఉన్నాయి. భాష‌ను బ‌తికించటం.. భ‌విష్య‌త్ త‌రాల‌కు అంద‌జేయ‌టం కూడా త‌మ సంక‌ల్పం అంటూ ఏపీ ఎన్ ఆర్‌టీ కో-ఆర్డినేట‌ర్ మాధ‌వి మేడి తెలిపారు. 6 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఈ పాఠ‌శాల‌లో 285 మంది చ‌దువుతున్నారు. వీరంద‌రినీ ఉన్న‌త‌స్థాయి చ‌దువులు చెప్పించటం.. భ‌విష్య‌త్ కు బంగారు బాట వేయ‌టం ద్వారా.. రేప‌టి స‌మాజానికి వీరిని ఉత్త‌మ‌పౌరులుగా అందించ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మంటూ మాధ‌వి స్ప‌ష్టంచేశారు. ఇదే స్ఫూర్తితో మ‌రికొంద‌రు ప్ర‌వాసాంధ్రులు కూడా ఏపీఎన్ఆర్ టీ ద్వారా.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చేయూత‌నిచ్చేందుకు ముందుకు రావ‌టం గొప్ప మ‌లుపు. రేప‌టి న‌వ్యాంధ్ర నిర్మాణానికి ఇది పొద్దుపొడుపు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.