ఏపీ ఎంపీల్లో కొత్త‌గుబులు!

వ‌యోభారం.. కుర్ర‌కారుతో త‌ట్టుకుని ప‌రుగెత్త‌లేక‌పోతున్న స‌మ‌యం.. ఏం చేయాలి. వార‌సుల్ని దించాలా! రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాలా! ఎమ్మెల్యే సీటుతో స‌ర్దుకుపోవాలా! ఎన్నిక‌ల ముందు ఏపీ పార్ల‌మెంట్ స‌భ్యుల్లో త‌లెత్తిన సందేహం. ఎందుకంటే.. నిన్న‌టి అవిశ్వాస తీర్మాన స‌భ‌లో యువ కెర‌టం రామ్మోహ‌న్‌నాయుడు, గ‌ల్లా, కేశినేనిల‌తో పోల్సితే అద్భుతంగా మాట్లాడాడు. పైగా ఇప్ప‌టికీ 93శాతం హాజ‌రుతో లోక్‌స‌భ‌లో ఉత్త‌మ‌పార్ల‌మెంటీరియ‌న్‌గా కూడా పుర‌స్కారం అందుకునే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు చెప్పుకుంటున్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, అవంతి శ్రీనివాస్‌, జేసీ దివాక‌ర్‌రెడ్డి జాడే క‌నిపించ‌లేదు. క‌నీసం.. వారు ఉన్నారా అనే అనుమానం కూడా తెలుగువారి మెద‌డులో మెదిలింద‌నే చెప్పాలి. మాగంటి, ముర‌ళీమోహ‌న్ వంటి వారు.. ప‌ద‌వుల్లో ఉన్నారా అనే అనుమానం కూడా క‌లిగింది. వైసీపీ ఎంపీలు ఆల్రెడీ రాజీనామా చేశారు కాబ‌ట్టి ప‌రువు ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి.. ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ఎంపీలు.. 2019లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేర‌నే ప్ర‌చారం సాగుతుంది. దాదాపు అంద‌రూ సీనియ‌ర్లే కావ‌టం.. పైగా ఢిల్లీలో ఉంటూ.. ప‌రిస్థితుల‌ను చ‌క్క‌బెట్ట‌డం వారికి ఇబ్బందిగా ఉంటుంద‌ట‌.
పైగా ఆరుప‌దులు దాటిన వ‌య‌సు.. షుగ‌ర్‌, బీపీల‌తో ఎందుకీ ఒత్తిడి అనే ధోర‌ణిలో కూడా కొంద‌రున్నారు. అందుకే.. ఏదోఒక ప‌ద‌వితో చుట్టూ మందీమార్బ‌లం  అల‌వాటైన నేత‌లు ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అది కూడా వ‌ద్ద‌నుకునే నేత‌లు వార‌సుల‌ను బ‌రిలోకి దింపి.. బ‌రువు దించుకోవాల‌నే యోచిస్తున్నార‌ట‌. ఆ జాబితాలో అటు జేసీ నుంచి ఇటు ముర‌ళీమోహ‌న్ వ‌ర‌కూ ఉన్నారు. పైగా.. ఒక్క నియోక‌వ‌ర్గంలో రాజ‌కీయం చేయ‌టం.. ఎన్నిక‌ల ఖ‌ర్చులు భ‌రించ‌టం ఈజీ అనే భావ‌న‌కు వచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎల‌క్ష‌న్స్ ప్ర‌చారానికి కోట్లు కుమ్మ‌రించాల్సిన ప‌రిస్థితి. పైగా ఓట‌రు నాడి అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగా ఉంది. గెలుస్తామ‌ని ధీమాగా ఉన్న నేత‌లు కూడా ఆఖ‌రి రోజున జ‌రిగే స‌మీక‌ర‌ణ‌ల‌తో ఓట‌మి చ‌విచూసే అవ‌కాశాలున్నాయి. పైగా ఈ ద‌ఫా.. అంతా కుల స‌మీక‌ర‌ణ‌లు.. వ‌ర్గ భావ‌న‌లు. ఇటువంటి కీల‌క‌మైన వేళ తెలిసి చేతులు కాల్చుకోవ‌టం అవ‌స‌ర‌మా! ఇన్నేళ్లు కూడ‌బెట్టిందంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా చేయాలా! అనే ఆందోళ‌న‌లో కూడా కొంద‌రు ఎంపీలు త‌మ అనుచ‌రుల వ‌ద్ద చ‌ర్చించార‌ట‌. ఈ లెక్క‌న‌.. లెక్క‌గ‌డితే.. ఎంపీ సీటుకు.. కొత్త ముఖాలు.. కాస్త‌.. కాసులు కుమ్మ‌రించే బ‌డాబాబులే ముందువ‌రుస‌లో ఉంటారేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.