మంత్రి జవహర్ కూడా జోకులేస్తున్నాడు…

ఏపీ మంత్రి జవహర్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. బీరు ఆరోగ్యానికి మంచిదని అప్పుడెప్పుడో చెప్పాడు. ఆయన బతికినంత వరకు జనాలు ఆ మాటను మర్చిపోరు. బీకామ్ లో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ ను ఎలా అయితే మర్చిపోరో..అలా ఉంటోంది జవహర్ తీరు. ఇప్పుడు కొత్త మాట చెబుతున్నారు జవహర్. ఏపీలో బెల్టు షాపులతో పాటు గంజాయి, సారా దుకాణాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలు. అలాంటి అమ్మకాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు జవహర్ అలాంటి వాటిని పక్కన పెడతామంటున్నారు.

ఒకటి కాదు..రెండు కాదు..నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నారాయన. అలా చెప్పిన ప్రతి సారి మరిన్ని గ్రామాలకు బెల్ట్ షాపులు విస్తరిస్తున్నాయి. ‘నవోదయం’ కార్యక్రమంలో భాగంగా 9 జిల్లాల్లోని అన్ని గ్రామాలను విజయవంతంగా సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు మంత్రి. సారా సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. మంచి పని చేస్తున్నారు. కానీ చెప్పేదానికి చేసే దానికి పొంతన ఉండటం లేదు. గంజాయి రవాణాకు యువత ఎక్కువగా పాల్పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు సరిగా లేవు. బెల్ట్ షాప్‌లపై 7351 కేసులు నమోదుచేసింది సర్కారు. కానీ ఒక్కరికీ శిక్ష పడలేదు. కేవలం కేసులకే పరిమితం అయ్యారు తప్ప మిగతా చర్యలు లేవు. నెల నెలా బెల్ట్ షాప్‌ల నుంచి పోలీసులకు మాముళ్లు వెళుతున్నాయి. ఇది బహిరంగ రహస్యం. చేసేదానికి చెప్పేదానికి పొంతన లేదు. కానీ బెల్ట్ షాపు రహిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం కానిదనే సంగతి మంత్రి జవహర్ గ్రహించలేదనుకుంటా. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.