ఏపీ కుమారస్వామి ఎవరో తెలుసా…

కర్నాటక కాబోయే సిఎం కుమారస్వామి గురించి మనకు తెలుసు. కానీ ఆంద్రప్రదేశ్ కుమారస్వామి ఎవరో తెలియదు. అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్. కర్నాటకలో ఎన్నికలకు ముందే నేను కింగ్ మేకర్ కాదు.. కింగ్ ను అవుతానని చెప్పాడు. కాలం కలిసి వచ్చింది. కింగ్ అయ్యారు. అంటే సిఎం పీఠం పై కూర్చుంటున్నాడు. విషయం ఏదైనా సరే. కూటములు ఎలా వచ్చినా సరే. సిఎంగా ఆయన కూర్చోనున్నారు. చెప్పింది చేస్తున్నాడు. అదీ లెక్క. 
కాకపోతే ఏపీలోను అలానే తాను అధికారంలోకి వస్తానని చెబుతున్నారు పవన్ కల్యాణ్. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఇలానే చెప్పారు. ఆచరణలో పాపం చేయలేక పోయాడు. ఆయన చేస్తానన్న ప్రజలు ఒప్పుకోలేదు. 22 సీట్లతో పక్కన పెట్టారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే పంథాలో వెళుతున్నాడు. మాటల్లో క్లారిటీలేదు. చేతల్లో ఇబ్బంది పడుతున్నాడు. నాలుగు రోజులు చంద్రబాబు జపం చేస్తాడు. తర్వాత నాలుగు రోజులు తిడతాడు. ఇలా మాటలు మార్చే నేతను ఏపీలో జనం పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలియదనుకుంటాను. అందుకే అలా మాట్లాడుతున్నారు. టీడీపీకి మెజార్టీ సీట్లు వస్తాయని.. మరోసారి అధికారం తమదేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పలు సర్వేలు ఇదే మాట చెబుతున్నాయి. వారు కాదు మేము ఈ సారి అధికారంలోకి వస్తామని చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడో విచిత్రం జరుగుతోంది. వారిద్దరు కాదు నేను అధికారంలోకి వస్తానని చెబుతున్నారు పవన్ కల్యాణ్. 
అరేయ్.. సాంబ రాసిపెట్టుకోరా… 2019లో తానే అధికారంలోకి వస్తానని చెబుతున్నాడు గబ్బర్ సింగ్ సినిమా డైలాగ్ ల తరహాలో  చెబుతున్నాడు పవన్ కల్యాణ్. సిఎం సీటు నాదేనని ప్రస్తావించాడు. అసలు ఆ పార్టీకి ఎక్కడా సరైన క్యాడర్ లేదు. నియామకాలు జరగలేదు. కీలకమైన నేతలు అందుబాటులో లేరు. కానీ అధికారానికి ఎలా వస్తాడో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలను కాదని.. జనసేనకు అందులోను కుల పరంగా పదవులు ఇస్తున్న పార్టీకి జనం పోటెత్తుతారా అంటే అనుమానమే.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.