నిరుద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం

నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కొత్త సంవత్సర కానుకను అందించింది. 2019 సంవత్సరానికి ఒక రోజు ముందు అంటే సోమవారం ఏపీ ప్రభుత్వం ఏడు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పలు విభాగాల కింద మొత్తం 1,386 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. గ్రూప్-1, గ్రూప్-2లతో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల ఎంపిక బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉద్యోగాలన్నింటికీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నింటికి సంబంధించిన దరఖాస్తు తేదీలు, పరిక్ష తేదీలను కూడా ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి నిరుద్యోగుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే డీఎస్సీ, పోలీసు శాఖలోని పలు ఉద్యోగాలు, లెక్చలర్ల పోస్టులతో పాటు పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

పోస్టులు… దరఖాస్తు తేదీలు
గ్రూప్‌-1: 169 – జనవరి 7 నుంచి 28 వరకు
గ్రూప్‌-2(292 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, 154 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు): 446 – జనవరి 10 నుంచి 31 వరకు
లెక్చరర్ల పోస్టులు(ప్రభుత్వ పాలిటెక్నిక్‌): 405 – ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు
లెక్చరర్ల పోస్టులు(ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు): 308 – ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు
మత్స్య శాఖలో ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు: 43 – జనవరి 18 నుంచి 8 వరకు
ఫిషరీస్‌ సబ్‌ సర్వీసులోఅసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ పోస్టులు: 10 – జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ పోస్టులు: 05 – జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.