జ‌గ‌న్‌కు దెబ్బేసే రెండు సంచ‌ల‌న నిర్ణ‌యాలు

చంద్ర‌బాబు ఈరోజు జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో రెండు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే, ఈ రెండు నిర్ణ‌యాలు జ‌గ‌న్ పార్టీ బ‌లంగా ఉన్న రెండు జిల్లాల ప్ర‌జ‌ల‌కు మేలు చేసేవి కావ‌డం గ‌మ‌నార్హం. తండ్రి ముక్య‌మంత్రిగా ఉన్నా సొంతూరికి నీళ్లివ్వ‌లేక‌పోయారు. కానీ వైఎస్ జ‌గ‌న్ పుట్టింటికి చంద్ర‌బాబు నీరు తీసుకెళ్లారు. క‌డ‌ప జిల్లాలో కొత్త‌గా వేల ఎక‌రాల‌కు చంద్ర‌బాబు ఈ నాలుగేళ్ల‌లోనే నీరిందించ‌గా… తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.
క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో కేంద్ర ప్రభుత్వం కేవ‌లం తెలుగు వారిపై కోపంతో నిర్ల‌క్ష్యం చేస్తున్న విష‌యం విదిత‌మే. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మోడీకి ఎన్నిసార్లు విన‌తిని పంపినా మోడీ ప్ర‌భుత్వం క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు క‌డ‌ప‌లో జ‌రిగిన ధ‌ర్మ పోరాట స‌భ‌లో ముఖ్య‌మంత్రి చివ‌రి సారిగా కేంద్రాన్ని హెచ్చ‌రించారు. మీరు క‌డ‌ప‌లో ఇప్ప‌టికైనా ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుచేయండి. మీ చేత‌కాక‌పోతే మేమే ఏర్పాటుచేస్తాం అని గ‌ద్దించారు. అయితే, సిగ్గు విడిచిన మోడీ ఏపీ విన‌తిని మ‌రోసారి బుట్ట‌లో వేశారు. దీంతో ఈ రోజు రాష్ట్ర మంత్రి మండ‌లి ఈ విష‌యంపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌డ‌ప‌లో ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌’ను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణ‌యించింది. దీనికి అవ‌స‌ర‌మైన నిధుల కోసం ఈక్విటీకి వెళ్ల‌డంతో పాటు ముందుకు వ‌చ్చే ప్రైవేటు సంస్థలతో జాయింట్ వెంచర్ చేయాల‌ని మంత్రి మండ‌లి తీర్మానించింది. ఈ నిర్ణ‌యంపై క‌డ‌ప ప్ర‌జ‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మయ్యాయి.
మ‌రోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్ కాస్త బ‌లంగా ఉండే ప్ర‌కాశం జిల్లాకు కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రకాశం జిల్లా దొనకొండ గ‌తంలో రాజధాని అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో చాలామంది అక్కడ స్థ‌లాలు, పొలాలు కొన్నారు. అయితే, అనేక ప‌రిణామాల నేప‌థ్యంలో, అంద‌రి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఏర్పాటుచేయాల్సి వ‌చ్చింది. అయితే, ఈ నిర్ణ‌యంతో దొన‌కొండ ప్రాంతం న‌ష్ట‌పోకుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈరోజు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దొన‌కొండ‌లో ‘దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్’ నిర్మాణానికి నిర్ణ‌యించింది. అంతేకాదు, త‌క్ష‌ణం 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయిస్తు నిర్ణ‌యం తీసేసుకుంది. అతి త్వ‌ర‌లో ఈ ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్టు మంత్రి మండ‌లి ప్ర‌క‌టించింది.
చంద్ర‌బాబు తీసుకున్న ఈ రెండు నిర్ణ‌యాల్లో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై సానుకూలతు పెంచేవే. వీటి వ‌ల్ల ఆ రెండు జిల్లాలు భారీగా లాభ‌ప‌డ‌న‌న్నాయి. విభ‌జిత ఆంధ్ర ప్ర‌దేశ్‌లో పాల‌న‌ను, అభివృద్ధిని చంద్ర‌బాబు వికేంద్రీకృతం చేశారు. దీనివ‌ల్ల ప్ర‌తి జిల్లాకు నీటితో పాటు ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చే ఏర్పాట్లు నిర్ణ‌యాలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.