ఒంటరి పోరుకు ఫిక్స్ అయిన ఏపీ కాంగ్రెస్

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగేందుకు ఏపీ కాంగ్రెస్ కసత్తు చేస్తోందని తెలుస్తోంది. దీనిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేస్తూ ప్రకటన కూడా చేసింది. పొత్తులపై తమకు క్లారిటీ ఉందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించి కాంగ్రెస్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొత్తులపై వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదన్న రఘువీరా తాజాగా అసెంబ్లీ నియోజకవర్గ నేతల సమవేశంలో ఎన్నికల ప్రణాళికపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీనిని చూస్తుంటే 2019 ఎన్నికలకు కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టిందని తెలుస్తోంది. తాజాగా విజయవాడలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ నేతల సమవేశంలో ఎన్నికల వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పీసీసీ చీఫ్ పార్టీ నేతలకు గట్టిగా చెప్పారట. అలాగే పార్టీ నవంబర్ 19 నాటికి 44 వేల బూత్ కమిటీలు వేసి త్వరలోనే ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, కర్నూలులో రాహుల్ గాంధీ పర్యటనే దీనికి నాంది అనే విధంగా కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జరిపిన సర్వేల్లో ప్రత్యేక హోదా కావాలంటూ 97.8శాతం ప్రజలు అభిప్రాయపడ్డట్లు వెల్లడైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని వారంటున్నారు.
కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా స్వతంత్రంగా పోటీ చేస్తాం తప్ప ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమనే కొత్త నినాదాన్ని వారు వినిపిస్తున్నారు. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175  అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కూడా కాంగ్రెస్  ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. కాగా 2014లో విభజన వల్ల నష్టపోయిన కాంగ్రెస్ ఈసారి ప్రత్యేక హోదా ఇస్తామనే ఆయుధంతో బరిలో దిగేందుకు సమాత్తమవుతున్నట్లు సమాచారం.  ఇటీవల రాహుల్ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు అధికారంలోకి వస్తే ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టంగా చెప్పడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.