ఆ మెజారిటీయే చెబుతుంది మోడీ గురించి!

క‌ర్ణాట‌క ఉప‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చంద్ర‌బాబు స్పందించారు. రాజ‌కీయం మంచిదే కానీ కుటుంబాల్లో చిచ్చు పెట్టే స్థాయిలో బీజేపీ రాజ‌కీయం చేయ‌డం వ‌ల్ల ఆ పార్టీకి ప్ర‌జ‌లు దూరం కావ‌డ‌మే కాకుండా అస‌హ్యించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. బెదిరింపు లేదా డ‌బ్బు… ఈ రెండింటితో మాత్ర‌మే మోడీ-షాల‌కు రాజ‌కీయం చేయ‌డం వ‌చ్చ‌ని చంద్ర‌బాబాబు వ్యాఖ్యానించారు. వాళ్ల‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న కోపం గురించి ఎవ‌రినీ అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని గెలుపొందిన అభ్యర్థులకు లక్షల్లో మెజారిటీలు రావడం అంటే మోడీ రాజకీయంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతింది. బీజేపీపై వ్య‌తిరేక‌త చూసి ఆ పార్టీకే చెందిన‌ ఒక అభ్యర్థి పోటీ చేయకుండా తప్పుకుంటే.. పోటీ చేసిన అభ్యర్థులు చాలా ఘోరంగా ఓడిపోయారని అన్నారు. నరేంద్ర మోదీ పాలనపై ప్ర‌జ‌ల్లో ఉన్న తీవ్ర‌ వ్యతిరేకతకు ఈ ఫలితాలే సాక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజలకు బీజేపీకి మ‌ధ్య ఎంత దూరం ఉందో… ఆ మెజారిటీ చూస్తే ఈపాటికి బీజేపీకి కూడా అర్థ‌మై ఉంటుంద‌న్నారు. అహంభావం ఉంటే… ప్ర‌జ‌లు ఎన్న‌డూ క్ష‌మించ‌ర‌ని అన్నారు. అహంభావం, అతి విశ్వాసం ఎవ‌రిని అయినా ప‌త‌నం చేస్తుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా… ఈ ఫ‌లితాల‌పై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ఫాసిస్టు భావ‌జాలంతో విర్ర‌వీగుతున్న బీజేపీకి క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు బాగా బుద్ధిచెప్పార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీల‌కు శుభ‌కాంక్షలు తెలిపారు. 2019లో ఈ ఫ‌లితాలు మ‌ళ్లీ దేశ‌మంత‌టా రిపీట్ అవుతాయ‌ని లోకేష్ జోస్యం చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.