బాబు ప‌ర్య‌ట‌న‌తో.. పెట్టుబ‌డులు పోటెత్తాయ్ 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడి చ‌రిష్మా గురించి కొత్తగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. మంచి విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెట్టుబ‌డులను ఆక‌ర్షించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పుకోవ‌చ్చు. గ‌తంలో హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసిన విష‌యంలోనూ, ప్ర‌స్తుతం అమ‌రావ‌తిని తీర్చిదిద్దుతున్న తీరులోనూ ఆయ‌న విజ‌న్ తేట‌తెల్ల‌మ‌వుతూనే ఉంది. 
తాజాగా ఐక్య‌రాజ్య స‌మితి వేదిక‌గా ప్ర‌కృతి సేద్యం అంశంపై కీల‌క ప్ర‌సంగం చేసేందుకుగాను అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. అక్క‌డ కూడా రాష్ట్రాభివృద్ధి ఆవ‌శ్య‌క‌త‌పై దృష్టిసారించారు. ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు, అధికారుల‌తో స‌మావేశమ‌య్యారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. ఆయ‌న ప్ర‌య‌త్నాలు చాలావ‌ర‌కు ఫ‌లించాయి. ప‌లు సంస్థ‌లు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర్చాయి. 
ఇవిగో చంద్ర‌బాబు భేటీల ఫ‌లితాలు.. 
* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ముద్ర సంబంధిత ప‌రిశోధ‌, సాంకేతిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటుచేసేందుకు అమెరికాకు చెందిన డీప్ వాట‌ర్ ఎక్స్‌ప్లొరేష‌న్ అండ్ రీసెర్చ్‌(డోయ‌ర్‌) సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో శాస్త్రవేత్త‌లు, సాంకేతిక‌త‌ల‌కు మెరైన్ టెక్నాల‌జీలో ప్రాథ‌మికంగా రూ.200 కోట్ల వ్య‌యంతో శిక్ష‌ణనిచ్చేందుకు సంసిద్ధ‌త తెలియ‌జేసింది. 
* ఏపీలో త‌యారీరంగ కంపెనీల్లో పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి రూ.200 కోట్ల‌తో ప్ర‌త్యేక నిధి ఏర్పాటుచేసేందుకు అమెరికాలోని ఆర్డ‌ర్ ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ సంస్థ ముందుకొచ్చింది. 
* రాష్ట్రంలో 100 రిసార్టుల‌ను ఏర్పాటుచేసేందుకు వి-రిసార్ట్ సంస్థ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. 
* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.728 కోట్ల‌తో సౌర బ్యాట‌రీల ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏపీఈడీబీ సంస్థ‌తో అమెరికా సంస్థ ట్రైకాన్ సోలార్ ఒప్పందం కుదుర్చుకుంది. 
*  టెలికాం రంగంలో అగ్ర‌గామిగా ఉన్న భార‌తీ ఎంట‌ర్‌ప్రైజెస్ సంస్థ ఛైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్‌తో న్యూయార్క్‌లో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. త‌మ భాగ‌స్వామ్య సంస్థ  ఫీల్డ్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌.. ఏపీలో ఆతిథ్యం, ఆహార‌శుద్ధి రంగాల్లో పెట్టుబ‌డులు పెడుతుంద‌ని మిట్ట‌ల్ ప్ర‌క‌టించారు. 
* రాష్ట్రంలో డ్రోన్ల త‌యారీ, ప‌రిశోధ‌న‌, అభివృద్ధికి సంబంధించిన ఒప్పందంపై వేల్యూ థాట్ ఐటీ సొల్యూష‌న్స్ సంస్థ‌తో ఒప్పందం కుదిరింది. 
* విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీలో డేటా అన‌లైటిక్స్, ఆప‌రేష‌న్స్ విభాగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వాట్సన్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ ముందుకొచ్చింది. 
* కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వంద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో డిజిట‌ల్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌వాసాంధ్రులు రూ.25 ల‌క్ష‌ల విరాళం అంద‌జేశారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.