తగ్గుతున్న మోడీ హవా

చలి చీమలు పామును చంపినట్లు అయింది. యూపీ ఎన్నికల ఫలితం అలానే వచ్చింది. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. బలమైన బీజేపీని ఏకాకిని చేశాయి. ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. కైరానా(ఉత్తరప్రదేశ్‌) లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నాయి. 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించమే ఇందుకు కారణం. ఇక్కడ సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌ మిగతా పక్షాలు కలిసిశాయి. ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చాయి. 
ఒక్కరు ఒకవైపు మిగతా వారంతా మరోవైపు. చివరకు కూటమిదే జయకేతనం ఎగురేశాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేదని ఓడిపోయిన నేత చెప్పడం ఆశ్చర్యం వేయక మానదు. విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీని ఓడించాయి. కర్నాటక ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్నాయి విపక్షాలు అందుకే ఏకమై బలమైన పార్టీని దెబ్బకొట్టారు. కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్‌ ఈ విజయం ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావం రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శమని చెప్పవచ్చు.  మహ్మద్‌ అలీ జిన్నా వివాదాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. ఉప ఎన్నికలో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆమె అంటున్నారు. కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ ఫిబ్రవరిలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది. అయినా సిట్టింగ్ సీటును గెలిపించుకోలేక పోయింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితం రావడం ఆశ్చర్యం వేయక మానదు. మొన్న రెండు సీట్లను యూపీలో కోల్పోయింది బీజేపీ. ఈ సారి మరొకటి. మొత్తంగా మూడు ఎంపీ సీట్లకు కోత పడింది. 
మోడీ హవా తగ్గుతుందని ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.