అమెరికాలో యాన్యువ‌ల్ బెనిఫిట్ గాలా!… మ‌నోళ్ల‌దే!

అమెరికాలో ప్ర‌వాసాంధ్రులు స‌త్తా చాటుతున్నారు. విద్య, ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్లిన ప్ర‌వాస తెలుగ ప్ర‌జ‌లు అక్క‌డే స్థిర‌ప‌డి త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డే ఉంటున్న తెలుగు ప్ర‌జ‌ల మంచి చెడులు చూసుకోవ‌డంతో పాటు వారి కుటుంబాల స‌మ‌గ్రాభివృద్ధికి సంబంధించి ప‌లు కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ్మేళనానికి అక్క‌డి మ‌న తెలుగు ప్ర‌జ‌లు శ్రీ‌కారం చుట్టారు. రేపు మిల్ పిటాస్‌లో జ‌ర‌గ‌నున్న ఈ భారీ స‌మ్మేళనంలో బాల‌ల స‌మ‌గ్ర అభివృద్ధిపై దృష్టి సారించ‌నున్నారు. బాల‌ల స‌మ‌గ్ర అభివృద్ధికి సంబంధించి వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో కీల‌క ప్రసంగాల‌ను ఇప్పించ‌నున్నారు. 
*యాన్యువ‌ల్ బెనిఫిట్ గాలా- హోలిస్టిక్ అప్రోచ్ టూ చైల్డ్ డెవ‌ల‌ప్ మెంట్‌* పేరిట నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మాన్ని చిరాగ్‌, సేవ్ ద చైల్డ్‌, చిల్డ్రన్స్ విట‌మిన్ ప్రాజెక్టు, వందేమాతరం, బిగ్ బ్ర‌ద‌ర్స్ బిగ్ సిస్ట‌ర్స్ అనే సంస్థ‌లు స్పాన్స‌ర్ చేస్తున్నాయి. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ప్రధాన ఆకర్ష‌ణ‌గా నాట్య ర‌త్న శ్రేయా అయ్య‌ర్‌, ప్ర‌పంచ ప్ర‌సిద్ధ క‌ళాకారుడు ఏవీ ఇలాంగోల నృత్య  ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా నెస్ట్ ఫౌండ‌ర్ మాట్ రోగర్స్‌, ప్ర‌ముఖ వైద్యులు డాక్ట‌ర్ హ‌నిమిరెడ్డి ల‌కిరెడ్డి, గూగూల్‌లో ఏపీజీ సీటీఓగా ప‌నిచేస్తున్న అనంత్ ఝింగ్రాన్‌, ఎక్స్‌పీరియ‌న్ సీటీఓ (ఎన్ఏ సీఐఎస్‌) ర‌వి దేవిశెట్టి, ప‌ల్స్ సెక్యూర్ సీఈఓ సుధాక‌ర్ రామ‌కృష్ణ త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు. 
మిల్ పిటాస్‌లోని ఇండియ‌న్ కమ్యూనిటీ సెంట‌ర్ లో రేపు సాయంత్రం 5,30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ స‌ద‌స్సులో బాల‌ల స‌మ‌గ్రాభివృద్ధిపై వివిధ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌సంగిస్తారు. వీరిలో ఇన్‌సైట్స్ వెంచ‌ర్స్‌కు చెందిన స్వాతి మైల‌వ‌ర‌పు కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్నారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్న ప్ర‌ముఖులు కూడా త‌మ అనుభ‌వాల‌ను, పిల్ల‌ల స‌మ‌గ్రాభివృద్ది కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు చేయ‌నున్నారు. బాల‌ల పోష‌ణ‌, పెంప‌కానికి సంబంధించి కీల‌క స‌ద‌స్సుగా ప‌రిగ‌ణిస్తున్న ఈ స‌మావేశానికి హాజ‌రై, ప్ర‌ముఖులు ఇచ్చే సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో త‌మ పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు మిల్ పిటాస్‌తో పాటు అమెరికాలో ఉంటున్న తెలుగు ప్ర‌జ‌లందరూ ఈ స‌ద‌స్సుకు త‌రలిరావాల‌ని నిర్వాహ‌కులు పిలుపునిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.