ఒక నెటిజ‌న్ అన్న క్యాంటీన్‌లో తిని ఫీల‌య్యాడు

సోష‌ల్ మీడియాలో ఏది ఎపుడు ఎలా వైర‌ల్ అవుతుందో చెప్ప‌లేం. ఏపీ ప్ర‌భుత్వం *అన్న క్యాంటీన్‌* పేరుతో 5 రూపాయాల‌కు సౌక‌ర్య‌వంత‌మైన భ‌వ‌నాల్లో చ‌క్క‌టి భోజ‌నం రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు అందుబాటులో ఉంచిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌తో పోలిస్తే … ఏపీలో అన్న క్యాంటీన్లు చాలా ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో ఒక రెస్టారెంటు స‌దుపాయాల‌తో నిర్మించింది. అదే తెలంగాణ‌లో రోడ్డు ప‌క్క‌న కేవ‌లం ఒక డ‌బ్బాలో పెట్ట‌డంతో కొంద‌రు మ‌న‌సు చంపుకుని అక్క‌డ తిన‌లేక‌పోతున్నారు. ఏపీలో ఆ స‌మ‌స్య లేదు. ఎవ‌రైనా వెళ్లి తినేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేశారు.
అయితే, ఈ రోజు జ‌గ‌దీష్ అనే ఒక నెటిజ‌న్ అన్న క్యాంటీన్‌లో భోజ‌నం చేసి త‌న అనుభ‌వాల్ని ట్విట్ట‌ర్లో పంచుకున్నారు. అత‌ను లోకేష్‌కి ట్యాగ్ చేయ‌డంతో లోకేష్ అత‌ని స్ఫూర్తికి న‌చ్చి రీట్వీట్ చేశారు. ఇంత‌కీ అత‌ని ట్వీట్ ఎందుకంత వైర‌ల్ అయ్యిందో తెలియాలంటే ఆ ట్వీట్‌లో అత‌ను ఇచ్చిన ఐడియా తెలుసుకోవాలి.
నెటిజ‌న్ ఆ ట్వీట్‌లో ఏం రాశారంటే… * నేను విజ‌య‌వాడ 22వ వార్డులో ఈరోజు అన్న క్యాంటీన్లో భోజ‌నం చేశాను. రుచిక‌ర‌మైన ఆ భోజ‌నం కేవ‌లం 5 రూపాయ‌లు ఇచ్చి తిన్నందుకు కొంచెం గిల్టీగా ఉంది. నాలాంటి బిల్లు చెల్లించ‌గ‌లిగిన‌ వారు ఎవ‌రైనా అక్క‌డ తింటే… మ‌నస్ఫూర్తిగా స్థోమ‌త‌కు త‌గ్గ‌ట్టు పే చేయ‌డానికి డొనేష‌న్ బాక్సు ఉంటే బాగుంటుంది. నిజానికి నేను తిన్న భోజనానికి రూ.వంద ఇవ్వాల‌నుకున్నాను. కానీ అవ‌కాశం లేక‌పోయింది* అని ట్వీట్ చేశారు.
దీనిని రీట్వీట్ చేసిన లోకేష్‌… మీ ఐడియా బాగుంది. డొనేష‌న్ బాక్సుల ఏర్పాటును ప‌రిశీలిస్తాం. థాంక్స్ జ‌గ‌దీష్ అంటూ వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.