తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు అమిత్ షా వ్యూహం?

రాజకీయ వ్యూహకర్త అమిత్ షా బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తున్నారని అంటుంటారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధిక మెజారిటీతో గెలిచిందంటే అది మోదీ ఒక్కరి వల్లే కాలేదని, ఆ విజయాల్లో అమిత్ షా కష్టం కూడా ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. ఎక్కడ ఏ అభ్యర్థికి సిటు ఇస్తే ఎన్ని ఓట్లు వస్తాయి. ఎంత మెజారిటీతో గెలుస్తాం అనే విషయాలు అమిత్ షా చక్కగా గుర్తెరుగుతారని ఆ పార్టీ నేతలు అంటుంటారు. ఇప్పుడు ఆయన దృష్టి తెలుగు రాష్ట్రాలమీద పడింది. ఎప్పటినుంచో రెండు రాష్ట్రాల్లో బీజేపీ తన హోదాను పెంచుకోవాలని కలలుగంటోందనే వార్త వినిపిస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ చేస్తున్న విమర్శలకు బీజీపీకి ఎంతో చెడ్డపేరు వచ్చేసిందని తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. ఇటీవలే గోషా మహల్ ఎమ్ఎల్ఏ పార్టీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ నేపధ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటగా ఆంద్రప్రదేశ్ లో పర్యటించనున్నారని సమాచారం. ఏపీలో 42,165 వరకు పోలింగ్ బూతులున్నాయి. అందులో 20 వేల పోలింగ్ బూత్ పార్టీ కమిటీ నిర్మాణం పూర్తయిందని తెలుస్తోంది. షా వచ్చిన తర్వాత మరో నాలుగు వేల బూత్ లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ పోలింగ్ బూత్ లో పోటీ చేసే అభ్యర్థులతో ఆయన మాట్లాడనున్నారు.
ఇందుకోసం ఒక సభను బిజెపి నాయకులు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో కూడా అదే తరహాలో ప్రణాళికలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో షా నిర్వహించే బహిరంగ సభలు ఉండవచ్చని భోగట్టా. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబి స్తున్నారనీ, ఇపుడు మాటమార్చి తమపై ఎదురుదాడి చేస్తున్నారన్న విష యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలిసింది.  పోలవరంలో జరిగిన అవినీతి, ప్రైవేటు కంపెనీలకు భూముల ధారాదత్తం తదితర అంశాలపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించే పనిని బీజేపీ కీలక నేతలకు అప్పగించారని సమాచారం. దీనికి తోడు జిల్లాల వారీగా అన్ని పార్టీల్లోని ద్వితీయశ్రేణి నేతలు, వృత్తి నిపుణులు, మేధావులను పార్టీలో తీసుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. మరి అమిత్ షా ప్లాన్స్ ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతాయో వేచిచూడాల్సిందే.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.