అమెరికాలో తెలుగు మువ్వలు! కూచిపూడి నృత్య సౌరభాలు!!

మెంఫిస్ మే 19: శారీరకంగాను మానసికంగాను ఏ కారణంగా నైనా వెనుకబడిన వారి ఎదుగుదలకి చేయూత నిచ్చే ధార్మిక సంస్థ(Empowering people with intellectual and developmental disabilities to achieve their full potential) టేనస్సీ రాష్ట్రం, మెంఫిస్ పట్టణంలోని “దిఆర్క్ మిడ్-సౌత్”. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ (http://thearcmidsouth.org/) ప్రతి సంవత్సరం కొన్ని వందలమందిని వివిధ రంగాల్లో,ఎన్నో రకాల వృత్తి, విద్యల్లో శిక్షణ నివ్వడం ద్వారా పరోక్షంగా ఎన్నో కుటుంబాలకి బాసటగా నిలుస్తోంది. ది ఆర్క్ ఆధ్వర్యంలో శనివారం,మే 19న 4వ ఇంటర్నేషనల్ టీ అండ్ ఫాషన్ షో మెంఫిస్ క్రోక్ సెంటర్లో వైభవంగా జరిగింది. మెంఫిస్ కూచిపూడి కళాక్షేత్రం – ఇండియన్బాలే థియేటర్ గత రెండు సంవత్సరాలుగా “ది ఆర్క్ మిడ్-సౌత్” వారి కార్యక్రమాల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొని తమవంతుసహాయ సహకారాలు అందిస్తోంది. టేనస్సీ ప్రభుత్వ గుర్తింపు పొందిన స్పిరిట్యుయల్ ఫౌండేషన్ (Spiritual Foundation) వారి ఆధ్వర్యంలోమెంఫిస్ పట్టణంలో ఇండియన్ బాలే థియేటర్ (Indian Ballet Theater since 1982) కూచిపూడి నృత్య శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.అమెరికాలో ఎందరో భారతీయుల్ని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల చిన్నారులకి కూచిపూడి నృత్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నసంస్థ డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి ఆద్వర్యంలోని ఈ కూచిపూడి కళాక్షేత్రం.

“డాన్సింగ్ బెల్స్ అఫ్ ఇండియా”గాపదుగురికి తెలిసిన “తెలుగు చిన్నారు  – తెలుగు మువ్వలు” శాన్వి కుంటమల్ల, సహస్ర తోట మరియు నిధి నిహారిక చెన్నం సంప్రదాయకూచిపూడి నృత్యం అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ ప్రదర్శించిన”ఆనందతాండవమాడే శివుడు” ఫాషన్ షోకి వచ్చిన ఆహ్వానితుల్ని ఉర్రుతలూగించింది. మెంఫిస్ ఇండియన్ బాలే థియేటర్ కళాకారులుసెయింట్ లూయిస్ పట్టణంలో గత ఏడాది తానా ఉత్సవాల్లో, చికాగో పట్టణంలో నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సంబరాల్లోసాంప్రదాయ కూచిపూడి నృత్యాల్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణఅమెరికా తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా మే 31-జూన్ 2 వరకు టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ పట్టణంలో నిర్వహిస్తున్న “అమెరికన్ తెలుగుకన్వెన్షన్ (American Telugu Convention-Irving Convention Center, Dallas, TX)”లో కూడా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఇండియన్ బాలేథియేటర్ డైరెక్టర్ శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి తెలిపారు.

  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.