భారత్ లో ప్రజాస్వామ్యం రాదని ఆనాడే చెప్పిన అంబేద్కర్…

భారత రాజ్యంగ పిత డాక్టర్ బిఆఆర్ అంబేద్కర్ ను బిబిసి న్యూస్ చానల్ 1953 జూన్ 22న చేసిన ఇంటర్వూ చేసింది. అప్పుడే భారత్ లో ప్రజాస్వామ్యం, రాజకీయ పరిస్థితులు జరగబోయే సంగతులను చాలా చక్కగావివరించారు అంబేద్కర్. ఆ ఇంటర్వూ అంశాలను యధాతథంగా చూద్దాం… 
1. బిబిసి ప్రతినిధి… భారత్ లో ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందా…
సమాధానం…

డాక్టర్ బిఆర్ అంబేద్కర్……భారత్ లో ప్రజా స్వామ్యం విజయవంతం అవ్వదు. ఒకవేళ అయినా నామ మాత్రంగానే ఉంటోంది. కానీ ఎన్నికలు, ప్రధాన మంత్రి, ఇతర అంశాలు ఉంటాయి. 

2. బిబిసి ప్రతినిధి…మరి..ఎన్నికలు ముఖ్యం కాదంటారా..
బిఆర్ అంబేద్కర్….ముఖ్యమే. కానీ ఓటింగ్ జరిగేది… ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు లేదా మార్చేందుకు అనే చైతన్యం ఎవరికీ లేదు.  ఎన్నికల్లో జోడెద్దుల గుర్తుకే ఓటేయాలని కాంగ్రెస్ కోరింది. ప్రజలు అలాగే ఓటేశారు. అభ్యర్థులకు ప్రాధాన్యం లేదు. జోడెద్దుల గుర్తు తరపున పోటీ చేసిన అభ్యర్థి గాడిదా…లేక విద్యా వంతుడా…అన్నది ఎవరూ చూడలేదు. 
3. బిబిసి ప్రతినిధి…సరైన వారు ఎన్నికైతేనే ఎన్నికలకు ప్రాధాన్యత ఉంటోంది. అలా జరగనప్పుడు ఎన్నికలకు విలువ  ఎందుకు ఉంటోంది… 
బిఆర్ అంబేద్కర్…భారత్ లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఈ సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనువైనదికాదు. భారత సమాజంలో అసమానతలే అందుకు కారణం. వివక్షతో కూడిన ఈ వ్యవస్థను శాంతియుత మార్గంలో అంతమొందించడానికి కొంత సమయం పడుతోంది. సమూల మార్పు కోసం ఎవరో ఒకరు ప్రయత్నించాలి. 
4. బిబిసి ప్రతినిధి….ప్రధాని, ఇతర నేతలు కూడ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు కదా…
అంబేద్కర్…ఇలాంటి ప్రసంగాలతో విసుగెత్తిపోయాం. మాటలు చెప్పడం కాదు. చేతల్లో చేసి చూపించాలి. 
5. బిబిసి ప్రతినిధి…భారత్ లో ప్రజా స్వామ్యం విఫలమైతే…ప్రత్యామ్నాయం ఏమిటి…
డాక్టర్ బిఆర్ అంబేద్కర్…అప్పుడు కమ్యూనిజం లాంటిదే ప్రత్యామ్నాయం. ప్రజలకు ఏం కావాలి…తిండి, కనీస అవసరాలే వారి ప్రాధాన్యం. అమెరికాలో ప్రజాస్వామ్యం విజయంవంతమైంది. అందుకే అక్కడ ఎప్పటికీ కమ్యూనిజం రాదని భావిస్తున్నా. 
6. బిబిసి ప్రతినిధి….భారత్ లో కూడ అలాంటి పరిస్థితులు నెలకొల్పవచ్చు కదా…
బిఆర్ అంబేద్కర్…అదెలా సాధ్యం…భూముల్లేవు. వర్షాల్లేవు అని ప్రజలు అంటున్నారు. మొదటి వీటిని పరిష్కరించాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని నేను అనుకోవడం లేదు.
మొత్తంగా అప్పటి జవహర్ లాల్ ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పకనే చెప్పేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాకపోతే అసమానతలను రూపు మాపేందుకు రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశ పెట్టి అందరినీ సమానం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈనాటి పాలకులు వాటిని కొనసాగిస్తే..సమాజంలో అంతరాన్ని పెంచుతున్నారనేది వాస్తవం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.