అంబానీ దూతగా వచ్చారా…

రిలయన్స్ అదినేత ముకేష్ అంబానీ ముఖ్యమంత్రి చంద్రబాబులు చాలా సేపు రహస్యంగా మాట్లాడుకున్నారు. అధికారిక కార్యక్రమం అయితే నేతలు, అధికారులు ఉండేవారు. కానీ వారెవరు లేకుండానే చంద్రబాబు కుటుంబంతో అంబానీ చాలా సేపు మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు, ముకేష్ అంబానీల మధ్య జరిగిన వ్యక్తిగత భేటీ వివాదంగా మారింది. మంత్రులు ఎవరూ లేకుండా కేవలం చంద్రబాబు కుటుంబ సభ్యులతోనే అంబానీ సమావేశం అవడంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ పక్షాన రాయబారిగా అంబానీ వచ్చారంటున్నారు. బీజేపీతో తెగదెంపులుపై ఆలోచించుకోవాలని ముకేష్ అంబానీ చంద్రబాబుకు చెప్పారనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో చంద్రబాబు, అంబానీ కుటుంబ సభ్యులు కలిసి వ్యాపారం చేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ భాగస్వామ్యంతో మరికొన్ని వ్యాపారాలు చేసేందుకు ఆ రెండు కుటుంబాలు మాట్లాడుకున్నాయని సమాచారం. 
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అత్యంత సన్నిహితుడు అంబానీ. అందుకే ఆయనతో మాట్లాడి పిలిపించారనే వాదన లేకపోలేదు. అంబానీ రాకపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తోంది జగన్ బ్యాచ్. ఐటీ మంత్రి నారా లోకేష్ ముంబైలో అంబానీని కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో ఒక పరిశ్రమ పెట్టడం కోసం అంబానీ వచ్చారని టీడీపీ వర్గాలు చెప్పే మాట. కానీ ఆయన దూతగా వచ్చారంటున్నారు టీడీపీ సీనియర్లు. 
దేశ స్థాయిలో చక్రం తిప్పే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. అందుకే అంబానీతో మంతనాలు చేశారని తెలుస్తోంది. రాష్ట్రంలో లోకేష్, దేశంలో చంద్రబాబులు కీలక పదవుల్లో ఉండేలా ప్లాన్ జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. అందుకే మోడీ ముందస్తుగా అంబానీని పంపించి రాజీ చర్చలు చేయిస్తున్నారంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.