బాబు మంచోడే.. కానీ?

హైద‌రాబాద్‌లో హైటెక్‌సిటీ.. చూస్తే గుర్తొచ్చే మొద‌టి పేరు ఆయ‌న‌దే. రాష్ట్ర విభ‌జన జ‌రిగిన‌పుడు ఎవ‌రు సీఎం అంటే జ‌నం గుర్తుకు తెచ్చుకున్న‌దీ ఆయ‌న్నే. అందుకే.. చంద్ర‌బాబునాయుడుని సీఎం చేయ‌టం. త‌మ క‌నీస బాధ్య‌త‌గా ఏపీ ఓట‌రు భావించాడు. అదే వేళ బీజేపీకు అనుకూల వాతావ‌ర‌ణం ఉండ‌టంతో బాబు క‌మలంతో దోస్తీ  చేయాల్సి వ‌చ్చింది. అది స్వార్థ‌మే.. నిజ‌మే.. కానీ.. త‌న‌తోపాటు. పార్టీను న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కూ ఏదో చేయాల‌నే త‌ప‌న‌. అది కాంట్రాక్టులా మ‌రేదైనా అంటే… అదీ నిజ‌మే. ఎందుకంటే.. కార్య‌క‌ర్త జేబు బావున్న‌పుడే.. పార్టీ వైపు నిల‌బ‌డ‌గ‌ల‌డు. అన్ని పార్టీలూ.. అధికారంలోకి రాగానే చేసే ప‌ని అదే. వైఎస్ హ‌యాంలో అది తారాస్థాయికి చేర‌టంతో జ‌నం విర‌క్తిచెందారు. అందుకే.. టీడీపీ వైపు మొగ్గుచూపారు. కొత్త‌రాజ‌ధాని నిర్మాణం.. నిధుల కొర‌త‌తో సీఎంగా బాబు ప‌డుతున్న ఇబ్బందిని జ‌నం గ‌మ‌నించారు. అర్ధం చేసుకున్నారు. న‌వ్యాంధ్ర నిర్మాణ సార‌ధి చంద్ర‌న్న త‌ప్ప ఇంకెవ‌రు అనే ఆలోచ‌న‌లోనే ఉన్నారు.

 

కానీ.. బీజేపీతో క‌టీఫ్  కొట్ట‌డంతో విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. తిట్లు.. శాప‌నార్ధాలు అన్నీ మొద‌ల‌య్యాయి. ఇదే స‌మ‌యంలో టీడీపీ అవినీతి కూడా వెలుగులోకి వ‌స్తోంది. అయితే… ఇదంతా బాబు టీమ్‌లో ఉన్న‌వారే కావ‌టంతో త‌ప్పుచేయ‌క‌పోయినా.. చంద్ర‌బాబు కూడా భాగం కావాల్సి వ‌చ్చింది. 2019 మ‌న‌దే అనుకున్న టీడీపీ ఇప్పుడు స్వీయ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. గెలుపు అంత సునాయాసం కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. దీనికి తాను  అధికారంలో లేక‌పోతే ఏపీ  ఏమౌతుంద‌నే భ‌యంప‌ట్టుకుందంటూ సాక్షాత్తూ అధినేత బాబు చేసిన కామెంట్స్ దీనికి బ‌లాన్నిస్తున్నాయి. వాస్త‌వానికి ఇటీవ‌ల ఏబీఎన్‌-ఆంధ్ర‌జ్యోతి చేసిన స‌ర్వేతో జోష్ రావాల్సిన టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌టం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసే విష‌య‌మే. ఇదంతా పే ఆర్టిక‌ల్స్ అనే విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశ‌మూ ఇచ్చిన‌ట్ట‌యింది. ఎంద‌రు ఏమ‌నుకున్నా.. ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌జ‌లు.. చంద్ర‌బాబునాయుడు స‌మ‌ర్థ‌నేత‌గా భావిస్తున్నారు. అవినీతి అనే ముద్ర‌లో బాబును భాగం చేసేందుకు స‌గానికి పైగా జ‌నం ఒప్పుకోవ‌ట్లేద‌నే తెలుస్తోంది. అనుభ‌వం ఉన్న నేత‌గా.. మ‌ళ్లీ బాబు రావాల‌నే జ‌నం ఆకాంక్ష‌ను దెబ్బ‌తీస్తోంది.. మాత్రం.. ప్ర‌జాప్ర‌తినిధులైన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల వ్య‌వ‌హార‌మే. పేద‌లు ఇల్లు క‌ట్టుకోవటానికి.. కూడా క‌మీష‌న్లు వ‌సూలు చేసే స్థాయికి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు దిగ‌జారారు. ఇసుక కుంభ‌కోణాల్లో చిక్కుకున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు ఏర్పాటుచేసిన జ‌న్మ‌భూమి క‌మిటీలు.. క‌మీష‌న్ల‌కు చిరునామాగా మారాయి. ఇవ‌న్నీ. జ‌నంలో టీడీపీ ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టాయి. అందుకే.. బాబు గెల‌వాలి.. కానీ.. ఈ ఎమ్మెల్యేలు వ‌ద్దు బాబోయే అనేంత‌గా విర‌క్తి చెందారు. అందుకే.. ఈ సారి చంద్ర‌బాబు చాలామంది సిట్టింట్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు విశ్రాంతి నివ్వ‌నున్నార‌నే ప్ర‌చారం సాగుతుంది. నేత‌ల‌కంటే.. టీడీపీ ముఖ్య‌మ‌నేది కూడా బాబు ఉద్దేశం కావ‌చ్చంటున్నారు పార్టీ శ్రేణులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.