అమరావతిలో ఆళ్లగడ్డ పంచాయితీ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పంచాయితీ అమరావతి చేరింది. తాజా ఘటనలను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు ఇరు వర్గాలను అమరావతికి పిలిపించారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న శోభా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత వారంతా అమరావతికి చేరారు. ఇరు వర్గాలతోను చంద్రబాబు మాట్లాడారు. పార్టీ పరువు బజారున పడకుండా చూసుకోవాలి. అంతేగానీ ఇలా చేసుకుంటే పద్దతికాదని హెచ్చరించారు చంద్రబాబు. మరోవైపు కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాస్ లతో మాట్లాడారు చంద్రబాబు. ఇంటెలిజెన్స్ వర్గాలు, పార్టీ నేతలు, ప్రైవేటు వ్యక్తులతో పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నారు చంద్రబాబు. ఇద్దరికీ వార్నింగ్ లు ఇచ్చారు చంద్రబాబు. 
మీరంతా కలిసి పని చేయాలి. లేదంటే చెప్పండి. ఏం చేయాలో నేను చేస్తానంటూ హెచ్చరించారు. మూడో వ్యక్తి మీ సీట్లోకి వస్తారు. మీ ఇష్టం. మాటి మాటికి పార్టీ పరువు బజారున పడేలా వ్యవహరించవద్దని చెప్పారు బాబు. అనేక సార్లు చెప్పినా మారకపోతే ఎలా అంటూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రతిష్ట ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో రాబోయే కాలంలో సీట్లు పెంచుకోవాలని.. లేకపోతే అంతా ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించారు చంద్రబాబు. మరోసారి తన దాక పంచాయితీ రావద్దని.. ఇద్దరు ఏం చేస్తున్నారో నివేదిక అంతా తన వద్ద ఉందని చెప్పారు. మంత్రి అఖిల ప్రియను సుతిమెత్తగా వారించారు చంద్రబాబు. మంత్రి పదవి ఇస్తే దాన్ని అభివృద్ధి చేసుకోవాలని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు పలికారు. పార్టీ కార్యాక్రమాలకు అడ్డు తగలడం దాడులు చేసుకోవడం, విందు రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.