ఈ సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ – ఏపీ స‌ర్కార్

సాధార‌ణంగా సంక్రాంతి అంతా టాలీవుడ్లో క‌నిపిస్తుంటుంది. కానీ ఈ సంక్రాంతి ఏపీ ప్ర‌భుత్వంలో క‌నిపిస్తోంది. ఈ సంక్రాంతి రాష్ట్రంలోని సుమారు 55 ల‌క్షల మంది ప్ర‌జ‌ల‌కు కొత్త పండ‌గ సంబ‌రాల‌ను తెచ్చింది. ఈ సంక్రాంతికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం తెలుగు ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప్ర‌తి ఒక్క‌రూ ఆనందంగా ఉన్న రాష్ట్రమే అభివృద్ధి చెందిన రాష్ట్రం అని న‌మ్మే చంద్ర‌బాబు ఫిబ్ర‌వ‌రి నుంచి ప్ర‌భుత్వం చెల్లించే అన్ని ర‌కాల పింఛ‌న్ల‌ను డ‌బుల్ చేశారు. ఇది మేనిఫెస్టోలో కూడా ఇవ్వ‌ని హామీ. అయినా, కేవ‌లం సామాజికంగా ఆర్థిక ప‌రిస్థితులు మారిన దృష్ట్యా పాత సాయం స‌రిపోద‌ని చంద్ర‌బాబు కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి వృద్ధులే కాదు…. పింఛ‌న్లు పొందుతున్న 55 ల‌క్ష‌ల మంది నిజ‌మ‌యిన సంక్రాంతి చేసుకోబోతున్నారు.
మిగులు బడ్జెట్ ఉన్న‌ తెలంగాణ రాష్ట్రంలో 5 రకాల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. కానీ లోటులో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక‌వైపు అన్ని ర‌కాల వృద్ధి సాధిస్తూ ముంద‌డుగు వేస్తూనే మ‌రోవైపు ఖ‌జానాకు భార‌మైనా కూడా ఏ వ‌ర్గాన్నీ నిర్ల‌క్ష్యం చేయ‌కుండా 12 ర‌కాల పెన్ష‌న్ల‌ను ఆస‌రా అవ‌స‌ర‌మైన ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తోంది.

అస‌లు ఆంధ్ర ప్ర‌భుత్వం ఇస్తున్న పింఛ‌న్లు ఏవో తెలుసా?

1) వృధ్యాప్య పెన్షన్- 1000 నుంచి 2 వేలకు పెంపు
2)వితంతు పెన్షన్ – 1000 నుంచి 2 వేలకు పెంపు
3)చేనేత పెన్షన్ – 1000 నుంచి 2 వేలకు పెంపు
4)మత్స్యకారులు -1000 నుంచి 2 వేలకు పెంపు
5)కళాకారుల పెన్షన్ – 1000 నుంచి 2 వేలకు పెంపు
6)డప్పు కళాకారుల పెన్షన్ – 1000 నుంచి 2 వేలకు పెంపు
7)గీతకార్మికుల పెన్షన్ – 1000 నుంచి 2 వేలకు పెంపు
8)ఒంటరి మహిళల పెన్షన్ – 1000 నుంచి 2 వేలకు పెంపు
9)ట్రాస్ జెండర్స్(హిజ్రాలు) పెన్షన్ – రూ 1,500 నుండి 3,000 కు పెంపు
10) చర్మతోలు వృత్తి దారుల పెన్షన్ – 1,500 నుండి 3,000 కు పెంపు
11) వికలాంగుల పెన్షన్ 1,500 నుంచి 3000 లకు పెంపు
12)డయాలసిస్(కిడ్నీ వ్యాధిగ్రస్తుల)పెన్షన్ – 2,500నుండి 3,500 కు పెంపు.

విచిత్రం ఏంటంటే… దేశంలో ఏ రాష్ట్రమూ కూడా ఇన్ని ర‌కాల పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్ల‌క్ష్యానికి గుర‌యిన ప్ర‌తి వ‌ర్గ‌మూ, ఆస‌రా అవ‌స‌ర‌మైన ప్ర‌తి వృత్తి, క‌ళాకారుడు ఏపీ రాష్ట్రంలో పింఛ‌ను పొందుతున్నారు. 55 లక్షల మందికి ప్రతి నెల 1,300 కోట్ల రూపాయలు పింఛ‌న్లు అందిస్తున్నారు. ఇది ఏడాదికి 15,600 కాగా, అయిదు సంవ‌త్స‌రాల‌కు 78,000 వేలకోట్ల రూపాయలు. ఇవి కాకుండా సంక్రాంతి తోఫాలు, రుణ‌మాఫీలు వంటివి అద‌నం. ప్ర‌జాసంక్షేమానికి ఈ స్థాయిలో ఒక ప్ర‌భుత్వ ఖ‌ర్చుచేయ‌డం ఒక రికార్డు అనే చెప్పాలి.

క్ర.సం కేటగిరీ మొత్తం పింఛన్లు సంఖ్య
1 వృద్ధులు 24,22,444
2 వితంతువులు 20,13,808
3 దివ్యాంగులు 6,41,820
4 చేనేత కార్మికులు 1,07,992
5 కల్లుగీత కార్మికులు 28,011
6 హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులు 32979
7 ట్రాన్స్ జెండర్లు 1665
8 మత్స్యకారులు 45,358
9 ఒంటరి మహిళలు 1,12,471
10 డయాలసిస్ రోగులు 8044
మొత్తం 54,14,592

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.