మనసుకు హత్తుకునేలా.. అక్కినేని అమల పోస్టు…

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లింది. అయినా సరే ఆమె ఎలా చనిపోయింది. ఎందుకు చనిపోయింది. ఎవరు చంపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా..లేక చనిపోయిందా..ఆమెది ప్రమాదమా..లేక మరోదైనా కుట్ర కోణం ఉందా…దుబాయ్ హోటల్ వారితో పాటు..అక్కడి ప్రభుత్వాధికారులను మేనేజ్ చేశారా..వాస్తవం ఏంటి అనే విషయాల పై కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. అందులో నిజం ఏంటి…అబద్దం ఏంటనేది తెలియడంలేదు. ఫలితంగా ప్రజలే కాదు..ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన నటి చనిపోతే ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ చాలా మంది నటీనటులు మీడియాకు చురకలంటించారు. ఎంతగా మీడియా దిగజారింది అంటే..శ్రీదేవి బాత్ రూమ్ టబ్ లో చనిపోయిందని చెప్పేందుకు ఏకంగా బాత్ రూమ్ లో టబ్ లో పడుకుని మరీ లైవ్ ఇచ్చిన వైనం దుమారం రేపుతోంది. విమర్శలకు తావిస్తోంది. 
                         దీని పై శ్రీదేవి చిన్ననాటి స్నేహితురాలు పింకీరెడ్డి, ఏక్తా కపూర్‌, రేణుకా షహానే, విద్యుల్లేఖ రామన్‌, కాజోల్, అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్, రానా వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో అక్కినేని అమల ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు.
 అది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది…ఆమె ఏం రాసిందో..యధాతథంగా ఇస్తున్నాం…
                      ‘‘ఎందుకు ఇంత అలసిపోయినట్లు ఉన్నాను?, ఎంత బరువు పెరిగాను? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా నన్ను ప్రశాంతంగా కాలం గడపనిస్తారా? నా కంటి కింద నలుపు రీడింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం వల్ల వచ్చింది. ముడతలు వయసును బట్టి వస్తాయి. సైజ్‌ జీరో లాంటివి గుర్తుచేయకుండా నన్ను ప్రశాంతంగా కోరుకున్న దుస్తులు వేసుకోనిస్తారా? ‘పుష్పక విమానం’లో నాకు పొడవాటి జుట్టుందని.. ఇప్పుడు కత్తిరించుకున్నానని జుట్టుకు రంగు వేసుకోకుండా ఉండనిస్తారా?’’
                       ‘‘నాకెంత జుట్టు ఉందన్న విషయం గురించే పట్టించుకుంటారు కానీ, నాకున్న జ్ఞానాన్ని గుర్తించరు. కెమెరాలు ఓ మనిషి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా చూపించగలుగుతాయా? నేను ఎలా వంట చేస్తాను? వంటి విషయాలు అడగకుండా నన్ను ప్రశాంతంగా అర్థవంతమైన విషయాలపై చర్చించనిస్తారా? మార్పు వచ్చేలా ఏదన్నా విభిన్నంగా చేయాలని నా అంతర్గత ఆలోచనలు తహతహలాడుతున్నాయి. భౌతికంగా నేను వెళ్లిపోయేలోపు పూర్తి చేయని విషయాలు పూర్తిచేయాలనుకుంటాను. ప్రశాంతంగా నన్ను నా దారిలో నడవనిస్తారా? నా జీవితంలో ఓ మిషన్‌ను పూర్తిచేయాలనుకుంటున్నాను. కానీ, ఇతరులు కలగజేసుకోవాలనుకున్నప్పుడు ఆ మిషన్‌ను పూర్తిచేయలేను. సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్లు, టీఆర్పీ రేటింగ్స్‌, బాక్సాఫీస్‌ పిచ్చి నుంచి నన్ను విముక్తురాలిని చేస్తారా? నా ఆత్మ స్వేచ్ఛగానే ఉంది. కానీ, నన్ను మాత్రం కాలం, పేరు ప్రతిష్ఠలు అనే పంజరంలో బంధించారు.’’
              ‘‘నా జీవితాన్ని నాకు వదిలేయండి. వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వండి. నిజం, లక్ష్యం వంటి అంశాల మధ్య బతికేందుకు అనుమతినివ్వండి. చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండి.’ అని రాయడం ఇప్పుడు హాట్ టాపికైంది. తెలుగు టీవీ చానల్స్ రెండు అత్యుత్యాహంతో చేసిన ఈ పనికి అంతా తిడుతున్నారు. ఇకనైనా వారు బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికిన తీరు చర్చనీయాంశమైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.