విద్యార్థుల్లో ప్రగతికి పాటుపాడుతున్న అగస్త్య ఫౌండేషన్

అగస్త్య ఫౌండేషన్‌ను రామ్‌జీ రాఘవన్ స్థాపించారు. లండన్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ డిగ్రీని సంపాదించిన తరువాత, 20 ఏళ్లలోనే ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. తర్వాత తన వ్యాపార జీవితానికి స్వస్తి చెప్పి ఏదైనా సేవ చేయాలని ఇండియాకు తిరిగి వచ్చేశారు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్‌గా రామ్‌జీ.. వ్యూహం, ఆవిష్కరణ, నిధుల సేకరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సంస్థాగత అభివృద్ధి, ప్రజా సమాచార మరియు బోర్డు మరియు మీడియా సంబంధాల విషయంలో బాధ్యతలు నిర్వర్తించడంలో కృషి చేశారు.
అగస్త్య ఫౌండేషన్ ట్రస్ట్.. పారదర్శకమైన, ప్రయోగాత్మక విద్యను అందిస్తూ ప్రపంచంలోనే సైన్స్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్స్ కలిగి ఉన్న పెద్ద సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రభుత్వ పాఠశాలల్లోని వెనుకబడిన పరిస్థితుల మధ్య చదువుకుంటున్న పిల్లల్లో ఆసక్తి పెంచడం, పోషణా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ సంస్థ పాటుపడుతుంది. ‘‘మొబైల్ వ్యాన్ సైన్స్ లాబ్స్’’, ‘‘లాబ్ ఆన్ ఏ బైక్’’, ‘‘లాబ్ ఇన్ ఏ బాక్స్’’ మరియు ‘‘యంగ్ ఇన్‌స్ట్రక్టర్ లీడర్స్’’ వంటి ఆవిష్కరణలతో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. అగస్త్యా పౌండేషన్‌లో 172 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ క్రియేటివిటీ ల్యాబ్ కలిగి ఉంది. ఇందులో సైన్స్ సెంటర్స్, డిస్కవరీ సెంటర్స్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్లానెటరీ సిస్టమ్ కలిగి ఉన్న ఆస్ట్రానమీ సెంటర్, రోబోటిక్స్ సెంటర్, ఆర్ట్ ల్యాబ్, మీడియా ఆర్ట్స్ ల్యాబ్, ఓపెర్ ఎయిర్ ఎకాలజీ ల్యాబ్ ఉన్నాయి. భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో 60 సైన్స్ కేంద్రాలు, 150 మొబైల్ సైన్స్ ల్యాబ్స్, 60 ల్యాబ్ ఆన్ బైక్స్, 400 నైట్ విలేజ్ స్కూల్స్ ద్వారా 2000 మంది టీచర్లు, 1.5 మిలియన్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అగస్త్య ఫౌండేషన్.. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రభుత్వాలతో అనుబంధంగా పని చేస్తుంది.
ఆర్థికంగా వెనుకబడి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాలు, జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ప్రతిభను వెలికి తీసేందుకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. భారతదేశంలోని 19 రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించిన సంగతి తెలిసిందే. 19 ఏళ్లుగా ఆ సంస్థ చేస్తున్న సేవల వల్ల 10 మిలియన్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. అంతే కాదు…2,50,000 మంది ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ ఈనెల 8న కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 
సిఏలోని పాల్కనాక్స్ లో సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు హాజరు కావాలని అగస్త్య ఫౌండేషన్ కోరుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా పెంచేందుకు, వారికి తోడ్పాటును ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించనుంది ఆగస్త్య. ఆగస్త్య ఉద్యమం పేరుతో రూపొందించే ఈ కార్యక్రమంలో తీసుకునే నిర్ణయాలు భారత్ లోని ఆర్థికంగా వెనుకబడిన పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా మారనుంది.అభివృద్ధికి పాటుపాడే వారంతా వచ్చి తమకు తగిన సహాకారం అందించాలని వారు కోరుతున్నారు. ఇంకా వినూత్న కార్యక్రమాలు ఏం చేయాలి. ఏం చేస్తే బావుటుందనే అంశాలను చర్చించడమే కాదు..వాటని అమలు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అగస్త్య ఫౌండేషన్ చెబుతోంది.     

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.