మ‌ళ్లీ గ‌ణ‌బాబు గంట‌మోగించేనా?

రాబోయే ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయ పరిస్థితులు నెల‌కొనేలా క‌నిపిస్తున్నాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తిరిగి ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ పోటీ కి సిద్ద‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. అలాగే  కాంగ్రెస్‌ నగర పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు జనసేన నుంచి ఇక్క‌డి టిక్కెట్ ను ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఉంది. ఫ‌లితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెల‌కొంటుంద‌ని చెప్పవచ్చు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా గుర్తింపు పొందింది.  కాగా 29 ఏళ్ల వయస్సులోనే ఉమ్మడి రాష్ట్రంలో పెందుర్తి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఘనత గణబాబుకు ద‌క్కింది. 1996 ఎన్నికల్లో ఆయ‌న టీడీపీ అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీచేసి  విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ప‌రిణామాల‌తో పార్టీకి దూరమయ్యారు.
అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరి విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా విజయం ద‌క్కించుకున్నారు. దీనితోపాటు టీడీపీ సర్వేలో జనంతో మమేకమైన నేతగా గుర్తింపు ద‌క్కింది. దీంతో ఇటీవల ప్రభుత్వ విప్‌గా కూడా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పశ్చిమలో చాలా సమస్యలు పరిష్కారమయ్య‌య‌ని స్థానికులు అంటున్నారు. గణబాబు సొంత గ్రామమైన గోపాలపట్నం పరిసరాల్లో ప‌లు మౌలిక వసతులను గణబాబు క‌ల్పించారు. తాను చేస్తున్న అభివృద్ధి పనులే గెలిపిస్తాయ‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. అయితే పశ్చిమ ఓటర్లలో కాపు సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ అదే సామాజిక వర్గం వారు.  అయితే ఈసారి ఎన్నికల్లో జనసేన పోటీకి దిగే అవకాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌న‌సేన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్య‌ర్థిని బరిలోకి దించితే ఇక్క‌డ‌ త్రిముఖ పోటీ గట్టిగా ఉంటుందని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.